నా టార్గెట్ అదే.. ఈటలను బీజేపీలోకి పంపింది ఆ సారే : రేవంత్ రెడ్డి

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కాంగ్రెస్​పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువస్తామని టీపీసీసీ నూతన అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తానని, అమరవీరుల ఆశయాల కోసం పనిచేస్తానని ప్రకటించారు. టీపీసీసీ చీఫ్​ప్రకటన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్​అధినేత్రి సోనియా, రాహుల్ గాంధీ ఆలోచన మేరకు పనిచేస్తానని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పార్టీలోని సీనియర్లు అందరినీ కలుస్తామని, అందరి అభిప్రాయాలు తీసుకుని పనిచేస్తామన్నారు. కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు ఎప్పుడూ ఉంటాయని, కుటుంబం అన్నప్పుడు […]

Update: 2021-06-26 20:26 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కాంగ్రెస్​పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువస్తామని టీపీసీసీ నూతన అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తానని, అమరవీరుల ఆశయాల కోసం పనిచేస్తానని ప్రకటించారు. టీపీసీసీ చీఫ్​ప్రకటన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్​అధినేత్రి సోనియా, రాహుల్ గాంధీ ఆలోచన మేరకు పనిచేస్తానని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పార్టీలోని సీనియర్లు అందరినీ కలుస్తామని, అందరి అభిప్రాయాలు తీసుకుని పనిచేస్తామన్నారు. కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు ఎప్పుడూ ఉంటాయని, కుటుంబం అన్నప్పుడు రకరకాల సమస్యలుండటం సహజమని ఆభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో సమస్యలపై పార్టీనేలందరం కలిసి కొట్లాడుతామని, అందరినీ కలుపుకుని పోతానన్నారు. ఉత్తమ్, భట్టి, జానారెడ్డిలాంటి వాళ్లతో మాట్లాడానన్నారు. మంచి యాక్షన్ ప్లాన్‌తో ముందుకు పోతామని, దానికి కార్యాచరణ రూపొందిస్తామని రేవంత్​వెల్లడించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ తమ కుటుంబమని, నిన్నా మొన్నటి వరకు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన వారిని కూడా కలుపుకుని పోతామని పేర్కొన్నారు. ప్రజల మనసు గుర్తెరిగి పని చేస్తామని రేవంత్​రెడ్డి చెప్పారు. ఇక పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించిన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డితో మాట్లాడతానని, ఎంపీ సీటు తనకు ఇవ్వాలని చెప్పిందే కేఎల్ఆర్‌ అని ఈ సందర్భంగా వివరించారు. కొన్ని ఒడిదుడుకులు ఉంటాయని, అందరితో చర్చ చేసి పని చేస్తామన్నారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. రాత్రికి రాత్రి వచ్చిన ఫ్లైట్ ఎవరిదని కిషన్​రెడ్డిని ప్రశ్నించారు. ఈటెల రాజేందర్‌ను బీజేపీలోకి పంపిందే సీఎం కేసీఆర్ అని రేవంత్‌ ఆరోపించారు. ఆ ప్రైవేట్ చార్టెడ్ ఫ్లైట్ ఓ కాంట్రాక్టర్‌దని, ఆ కాంట్రాక్టర్‌కు కేసీఆర్‌కు ఉన్న బంధం ఏమిటో తేలాలని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

కలిసి పని చేస్తాం : జగ్గారెడ్డి

కాంగ్రెస్ ​అధిష్టానం నిర్ణయం ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్​ నేతలందరం కలిసి పని చేస్తామని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. తనకు వర్కింగ్​ ప్రెసిడెంట్​ ఇవ్వడం ఆనందమన్నారు. వచ్చే ఎన్నికల వరకు పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకువస్తామని జగ్గారెడ్డి వెల్లడించారు. ఇక సోషల్ మీడియాలో తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేసే చెత్త బ్యాచ్ తాట తీస్తామని జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. దళిత సమస్యలపై సీఎం కేసీఆర్‌ను కలవడాన్ని కొందరు చెత్త వెధవలు తప్పు పడుతున్నారని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి చెత్త బ్యాచ్ తాట తీస్తామని ఆయన హెచ్చరించారు. పార్టీని కొందరు భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తమ పైన అసత్య ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, ప్రజా సమస్యలపై సీఎంలను కలిసే సాంప్రదాయం గతంలో కూడా ఉందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.

Tags:    

Similar News