బిగ్‌బ్రేకింగ్ : కాక పుట్టిస్తున్న కోకాపేట ల్యాండ్ స్కాం..? రేవంత్ రెడ్డి అరెస్టు..!
దిశ, తెలంగాణబ్యూరో : టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కోకాపేట భూముల వ్యవహారంలో ప్రభుత్వ విధానాన్ని తప్పు పడుతూ ఇవ్వాళ అక్కడ ధర్నాకు వెళ్లాల్సి ఉంది. అనంతరం ఆయన పార్లమెంట్ సమావేశాలకు ఢిల్లీ వెళ్లనునున్నారు. కానీ సోమవారం తెల్లవారుజాము నుంచే పోలీసులు రేవంత్‌రెడ్డి ఇంటివద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. బయటకు రాకుండా అడ్డుకున్నారు. హైదరాబాద్‌లోని పలు కాంగ్రెస్నేతల ఇండ్ల దగ్గర అదే పరిస్థితి. కోకాపేట భూముల అమ్మకాల్లో రూ.వెయ్యి కోట్ల అవినీతి జరిగిందంటూ […]
దిశ, తెలంగాణబ్యూరో : టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కోకాపేట భూముల వ్యవహారంలో ప్రభుత్వ విధానాన్ని తప్పు పడుతూ ఇవ్వాళ అక్కడ ధర్నాకు వెళ్లాల్సి ఉంది. అనంతరం ఆయన పార్లమెంట్ సమావేశాలకు ఢిల్లీ వెళ్లనునున్నారు. కానీ సోమవారం తెల్లవారుజాము నుంచే పోలీసులు రేవంత్‌రెడ్డి ఇంటివద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. బయటకు రాకుండా అడ్డుకున్నారు. హైదరాబాద్‌లోని పలు కాంగ్రెస్నేతల ఇండ్ల దగ్గర అదే పరిస్థితి. కోకాపేట భూముల అమ్మకాల్లో రూ.వెయ్యి కోట్ల అవినీతి జరిగిందంటూ రేవంత్‌రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే.
అక్కడే నిరసనకు రంగారెడ్డి డీసీసీ ఆధ్వర్యంలో పిలుపునివ్వగా ముందస్తుగానే పోలీసులు రేవంత్ రెడ్డిని గృహ నిర్బంధం చేశారు. అయితే, తనను పార్లమెంట్ సమావేశాలకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని, దీనిపై పార్లమెంట్ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానని రేవంత్‌రెడ్డి తెలిపారు. అదేవిధంగా టీపీసీసీ నేత మల్లు రవిని కూడా పోలీసులు నిర్బంధం చేశారు. కోకాపేట భూముల సందర్శనకు జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహ, మహేష్‌గౌడ్ నేతృత్వంలోని టీపీసీసీ కమిటీతో కలిసి వెళ్లనున్నారు. ఈ సందర్శనను అడ్డుకునేందుకు పోలీసులు రేవంత్‌తో పాటు ఆయా నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి ఇంటి దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.