జలపాతం చూద్దామని వెళ్లి.. వాగులో 16 మంది పర్యాటకులు..

దిశ, నిర్మల్ రూరల్ : జలపాతం చూద్దామని వెళ్లిన సందర్శకులు వరద నీటిలో చిక్కుకున్న ఘటన జిల్లాలోని మామడ మండలంలోని వాస్తపూర్ జలపాతం వద్ద చోటు చేసుకొంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్, బాసరకు చెందిన రెండు కుటుంబాల సభ్యులు శుక్రవారం జలపాతం సందర్శనకు వచ్చారు. జలపాతాన్ని చూసి తిరిగి వెళ్లే సమయంలో భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో పై నుంచి వరద నీరు భారీగా రావడంతో మార్గ మద్యంలో ఉన్న వాగు […]

Update: 2021-09-03 09:05 GMT

దిశ, నిర్మల్ రూరల్ : జలపాతం చూద్దామని వెళ్లిన సందర్శకులు వరద నీటిలో చిక్కుకున్న ఘటన జిల్లాలోని మామడ మండలంలోని వాస్తపూర్ జలపాతం వద్ద చోటు చేసుకొంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్, బాసరకు చెందిన రెండు కుటుంబాల సభ్యులు శుక్రవారం జలపాతం సందర్శనకు వచ్చారు.

జలపాతాన్ని చూసి తిరిగి వెళ్లే సమయంలో భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో పై నుంచి వరద నీరు భారీగా రావడంతో మార్గ మద్యంలో ఉన్న వాగు ఉప్పొంగింది. దీంతో సందర్శకులు వాగులో చిక్కుకున్నారు. అక్కడే ఉన్న స్థానికులు ఈ విషయాన్ని గమనించి వెంటనే మామడ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసు సిబ్బందితో అక్కడికి చేరుకున్న ఎస్ఐ వినయ్, స్థానికుల సహాయంతో వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఈ క్రమంలో ఎలాంటి ప్రాణహాని జరగలేదని ఎస్ఐ తెలిపారు.

Tags:    

Similar News