ఎన్‌కౌంటర్.. టాప్ కమాండర్లు హతం
దిశ, వెబ్‌డెస్క్ : ఉగ్రవాదులకు, అప్ఘన్ సైన్యం మధ్యం ఎదురు కాల్పులు జరిగాయి. శనివారం రాత్రి జరిగిన ఈ కాల్పుల్లో ఐదుగురు లష్కరేతోయిబా ఉగ్రవాదులు మృతిచెందగా అందులో ఇద్దరు టాప్ కమాండర్లు సైతం ఉన్నారు. డాంగం జిల్లా కునర్ ప్రావిన్స్‌లో నేషనల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ (ఎన్‌డీఎస్), ఆప్ఘాన్ నేషనల్ ఆర్మీ(ఏఎన్ఏ) కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో హతమైన ఇద్దరు టాప్ కమాండర్లను పచా ఖాన్, అఖ్తర్‌గా అధికారులు గుర్తించారు. మృతిచెందిన టాప్ కమాండర్లు […]
దిశ, వెబ్‌డెస్క్ : ఉగ్రవాదులకు, అప్ఘన్ సైన్యం మధ్యం ఎదురు కాల్పులు జరిగాయి. శనివారం రాత్రి జరిగిన ఈ కాల్పుల్లో ఐదుగురు లష్కరేతోయిబా ఉగ్రవాదులు మృతిచెందగా అందులో ఇద్దరు టాప్ కమాండర్లు సైతం ఉన్నారు. డాంగం జిల్లా కునర్ ప్రావిన్స్‌లో నేషనల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ (ఎన్‌డీఎస్), ఆప్ఘాన్ నేషనల్ ఆర్మీ(ఏఎన్ఏ) కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో హతమైన ఇద్దరు టాప్ కమాండర్లను పచా ఖాన్, అఖ్తర్‌గా అధికారులు గుర్తించారు.
మృతిచెందిన టాప్ కమాండర్లు పచా ఖాన్ షాహి తంగై జిల్లాకు చెందిన వాడు కాగా, బజార్ అనే ఉగ్రవాది ఖైబర్ ప్రావిన్స్‌కు చెందిన వాడిగా గుర్తించారు. డాంగం జిల్లా ఏరియాలో లష్కరే ఉగ్రవాదులు దాక్కుని ఉన్నట్లు సమాచారం రావడంతో ఆప్ఘన్ భద్రతా సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి ఆపరేషన్ చేపట్టింది. సైన్యానికి, టెర్రరిస్టులకు మధ్య బీకర కాల్పులు చోటుచోసుకోగా మొత్తం ఐదుగురు ఉగ్రవాదులు హతమైనట్లు ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లడించారు.