ఏపీలో ఆదివారం బస్సులు బంద్

ఏపీలో ఆదివారం ఆర్టీసీ బస్సు సర్వీసులను నిలిపివేస్తున్నట్లు రవాణా మంత్రి పేర్ని నాని తెలిపారు. ప్రధాని మోదీ కరోనా‌పై పోరాటంలో భాగంగా ‘జనతా కర్ఫ్యూ’ పిలుపునకు సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. దూర ప్రాంత సర్వీసులను శనివారం అర్ధరాత్రి నుంచి నిలిపివేయనున్నట్లు చెప్పారు. ఇందుకు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు కూడా సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఇక, కరోనా నియంత్రణ చర్యల పర్యవేక్షణకు ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసింది. టాస్క్ ఫోర్స్ […]

Update: 2020-03-21 02:31 GMT

ఏపీలో ఆదివారం ఆర్టీసీ బస్సు సర్వీసులను నిలిపివేస్తున్నట్లు రవాణా మంత్రి పేర్ని నాని తెలిపారు. ప్రధాని మోదీ కరోనా‌పై పోరాటంలో భాగంగా ‘జనతా కర్ఫ్యూ’ పిలుపునకు సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. దూర ప్రాంత సర్వీసులను శనివారం అర్ధరాత్రి నుంచి నిలిపివేయనున్నట్లు చెప్పారు. ఇందుకు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు కూడా సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఇక, కరోనా నియంత్రణ చర్యల పర్యవేక్షణకు ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసింది. టాస్క్ ఫోర్స్ చైర్మన్‌‌గా జిల్లా కలెక్టర్లు, కన్వీనర్‌గా డీఎంహెచ్‌వోలను నియమించారు.

Tags: bus, ban, apsrtc, minister perni nani

Tags:    

Similar News