ప్రేమకు జై కొట్టిన హీరోలు

        ప్రేమ… విశ్వజనీనం, అజరామరం. ప్రతీ ఒక్కరూ ఆ ప్రేమకు దాసోహం కావాల్సిందే. అంతులేని ఆనందాన్నిఅందుకోవాల్సిందే. ప్రేమ ఒక బంధం.. ప్రేమ ఒక బాధ్యత… ఈ అనుబంధమే మూడు ముళ్లకు దారి తీస్తుంది. ఏడడుగులు నడిపిస్తుంది. అలా పచ్చని తోరణాలు, వేదమంత్రాల నడుమ ఏడడుగులు వేసి… అగ్నిసాక్షిగా మూడు ముళ్లు వేసిన మన హీరోలు కూడా తమ అర్ధాంగి ప్రేమకు సలాం కొట్టినవారే. ఆ ప్రేమను దూరం చేసుకోలేక పసుపుతాడు కట్టి సొంతం […]

Update: 2020-02-14 01:55 GMT

ప్రేమ… విశ్వజనీనం, అజరామరం. ప్రతీ ఒక్కరూ ఆ ప్రేమకు దాసోహం కావాల్సిందే. అంతులేని ఆనందాన్నిఅందుకోవాల్సిందే. ప్రేమ ఒక బంధం.. ప్రేమ ఒక బాధ్యత… ఈ అనుబంధమే మూడు ముళ్లకు దారి తీస్తుంది. ఏడడుగులు నడిపిస్తుంది. అలా పచ్చని తోరణాలు, వేదమంత్రాల నడుమ ఏడడుగులు వేసి… అగ్నిసాక్షిగా మూడు ముళ్లు వేసిన మన హీరోలు కూడా తమ అర్ధాంగి ప్రేమకు సలాం కొట్టినవారే. ఆ ప్రేమను దూరం చేసుకోలేక పసుపుతాడు కట్టి సొంతం చేసుకున్నవారే.

ఒక బంధం బలపడితే దూరం చేసుకోలేరు. ఎన్ని ఆటంకాలు వచ్చినా బంధానికి కట్టుబడే ఉండాలని జీవితాంతం ఆ బంధాన్ని కొనసాగించాలని అనుకుంటారు. అలాగే ఆలోచించాడు టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు. తనకన్నా పెద్దదైనా సరే… తనను పూర్తిగా అర్థం చేసుకున్న హీరోయిన్ నమ్రతా శిరోద్కర్‌ను కలలో కూడా కాదనుకోలేకపోయాడు. అందుకే ముందుగా నమ్రతకు ప్రపోజ్ చేసి తనను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. 15 ఏళ్ల కాపురంలో ఎలాంటి అరమరికలు లేకుండా హ్యాపీగా లైఫ్‌ను లీడ్ చేస్తోంది మహేష్, నమ్రత జంట. 15 ఏళ్లు అయినా కూడా నీ మీద రోజు రోజుకు ప్రేమ పెరుగుతోంది నమ్రత అని మహేష్ చెబితే… ఇంతకన్నా గొప్ప వరం ఏం కావాలి ఒక ఆడపిల్లగా అంటూ మురిసిపోయింది నమ్రత.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ప్రేమ బాటలోనే ప్రయాణించారు. ప్రేమ పెళ్లే చేసుకున్నారు. ఇంట్లో ఇష్టం లేకపోయినా స్నేహ అందానికి బానిసై, అణుకువకు ముగ్ధుడై జులాయిలా ఆమె చుట్టే తిరిగాడు. నిన్ను తప్ప మరొకరిని పెళ్లి చేసుకోలేనని వివరించాడు. దీంతో బన్నీ లవ్‌ను యాక్సెప్ట్ చేసిన స్నేహ.. నీతోనే నా జీవితం అంటూ మాట ఇచ్చింది. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న ఈ జంటను ఎక్కడ.. ఎప్పుడు… చూసినా ముచ్చట వేస్తుంది. ఒకరి కోసం ఒకరు పుట్టారేమో అనిపిస్తుంది.

నేచురల్ స్టార్ నాని.. పక్కింటి అబ్బాయిలా కనిపించే నాని.. నిజంగానే అంజలిని పడేసేందుకు చాలా ట్రై చేశాడట. నాని కజిన్ ద్వారా పరిచయం అయిన అంజలి కూడా నాని లవ్‌ను ఫీల్ అవడంతో పెళ్లి పీటలు ఎక్కింది ఈ జంట. ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా పెళ్లి చేసుకుని చక్కగా సెటిల్ అయిపోయారు.

నాగ చైతన్య… ఏకంగా హీరోయిన్‌నో బుట్టలో వేసేశాడు. ఏ మాయ చేశావే సినిమాతో తన అందంతో మాయ చేసిన సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత కూడా సమంత కెరియర్ ఇంత చక్కగా సాగుతుంది అంటే చైతు, సామ్‌ని ఎంత బాగా అర్థం చేసుకుంటున్నాడో… ఎంత చక్కగా ప్రోత్సహిస్తున్నాడో అర్థమవుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఎలాంటి అరమరికలు లేకుండా జీవితం సాఫీగా సాగుతుంది అంటారు కదా.. చైతు, సామ్‌లు ఇందుకు ఉదాహరణ అనే చెప్పొచ్చు.

పవన్ కళ్యాణ్ …. రేణు దేశాయ్ అందానికి, అమాయకత్వానికి పడిపోయాడు. ఆమెతో ఉంటే ఆనందంగా ఉంటానని అనుకున్నాడు. హీరోయినే అయినా సినిమాలకు దూరంగా ఉంటూ పవన్‌కు భార్యగా అన్ని బాధ్యతలు నిర్వర్తించింది రేణు. పవన్ కూడా అన్ని విధాలుగా ఆమెను సంతోషంగా ఉంచాడు. కానీ, ఇద్దరు పిల్లలు కూడా పుట్టాక… విడిపోయారు. ఎవరికి వారు జీవిస్తూ హ్యాపీగా ఉన్నారు. అంటే ఎదుటివారిని ప్రేమిస్తే.. వాళ్లకు మనం నచ్చకపోతే… విడిపోయేందుకు కూడా రెడీగా ఉండేదే నిజమైన ప్రేమ కాబోలు అనుకున్నారేమో. అలా విడిపోయారు. ఇలా స్నేహితులుగా ఉండిపోతున్నారు.

కొత్తగా తెరపైకి వచ్చిన యువ హీరోలు కూడా ప్రేమ పెళ్లికి ఓటేస్తున్నారు. చిన్నప్పటి నుంచి షారుక్ సినిమాలు చూస్తూ పెరిగిన హీరో నిఖిల్ ఎలాగైనా ప్రేమ పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడట. ఈ క్రమంలోనే ఓ డాక్టర్‌ను చూసి మనసుపారేసుకున్న నిఖిల్ తనతో నిశ్చితార్థం చేసుకున్నాడు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు.

జయం, ఇష్క్‌ లాంటి ప్రేమ కథ చిత్రాలతో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న నితిన్ కూడా లవ్ మ్యారేజే బెటర్ అంటున్నాడు. నాలుగేళ్లుగా ప్రేమిస్తున్న అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఏప్రిల్ 16న షాలిని అనే అమ్మాయితో మ్యారేజ్ చేసుకుని చక్కగా సెటిల్ అయిపోతాడట.

Tags:    

Similar News