నీవల్ల కాదు అంటే చేసి చూపిస్తా – సానియా మిర్జా
దిశ, స్పోర్ట్స్: ‘నీ వల్ల కాదు’ అని తనను ఎవరైనా నిరుత్సాహపరిస్తే తాను ఒప్పుకోబోనని, ఎలాగైనా సరే సాధించి చూపించేదాక వెనకడుగు వేయనని టెన్నిస్ స్టార్ సానియా మిర్జా అన్నారు. టెన్నిస్‌పై తనకు ఉన్న అమితమైన ప్రేమే వ్యాయామం చేసి బరువు తగ్గించుకునేలా చేసిందని అన్నారు. అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ (ఐఓసీ) ఆధ్వర్యంలో జరిగిన ఆన్‌లైన్ కార్యక్రమంలో అమ్మతనం, ఎదురైన సవాళ్లపై తన సహచర అథ్లెట్లను ఉద్దేశించి సానియా ప్రసంగించారు. టెన్నిస్ కెరీర్‌లో ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడే […]
దిశ, స్పోర్ట్స్: ‘నీ వల్ల కాదు’ అని తనను ఎవరైనా నిరుత్సాహపరిస్తే తాను ఒప్పుకోబోనని, ఎలాగైనా సరే సాధించి చూపించేదాక వెనకడుగు వేయనని టెన్నిస్ స్టార్ సానియా మిర్జా అన్నారు. టెన్నిస్‌పై తనకు ఉన్న అమితమైన ప్రేమే వ్యాయామం చేసి బరువు తగ్గించుకునేలా చేసిందని అన్నారు. అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ (ఐఓసీ) ఆధ్వర్యంలో జరిగిన ఆన్‌లైన్ కార్యక్రమంలో అమ్మతనం, ఎదురైన సవాళ్లపై తన సహచర అథ్లెట్లను ఉద్దేశించి సానియా ప్రసంగించారు. టెన్నిస్ కెరీర్‌లో ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడే పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకుని, కుమారుడు ఇజాజ్‌కు జన్మనిచ్చారు. ఆ తర్వాత టోక్యో ఒలంపిక్స్ లక్ష్యంగా తన ఫిట్‌నెస్‌పై దృష్టి సారించారు. గర్భం దాల్చడం వల్ల 23కిలోల బరువు పెరిగిన సానియా అందరినీ ఆశ్చర్యపరిచేలా కేవలం నాలుగు నెలల్లోనే 26కిలోలు తగ్గారు. తాను బరువు తగ్గడానికి తనకున్న వెనకడుగు వేయని మనస్తత్వమే కారణమని చెప్పారు. ‘రియో ఒలంపిక్స్ నా జీవితంలో చాలా బాధాకరమైన సంఘటనల్లో ఒకటి. ఆ తర్వాత టెన్నిస్ ఆడతానని కూడా అనుకోలేదు. కానీ తాను మానసిక బలాన్ని నమ్ముకున్నాను. ప్రసవానంతరం కుంగుబాటుకు లోనుకాకుండా ప్రతిరోజూ వ్యాయామాలు చేశాను. ఇప్పుడు తిరిగి ఆటలో అడుగుపెట్టి టోక్యో ఒలంపిక్స్‌లో పతకం గెలవాలనే లక్ష్యం పెట్టుకున్నాను’ అని సానియా వెల్లడించారు. ‘మహిళలకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నేనే సాధించాను అంటే అది మీరు కూడా సాధించగలరు. ప్రతిరోజూ గంట సేపు జిమ్‌లో కష్టపడండి. ఫలితం మీరే చూస్తారు. మనం తలచుకుంటే ఏదైనా సాధ్యమే’ అంటూ మానసిక స్థైర్యం నింపారు.