విలన్ పాత్రకు రూ. 200 కోట్లు!.. హాట్ టాపిక్‌గా మారిన స్టార్ హీరో రెమ్యునరేషన్!
కేజీఎఫ్ (KGF)1,2 సినిమాలతో పాన్ ఇండియా లెవల్‌లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు కన్నడ స్టార్ యష్(Yash).
దిశ, సినిమా: కేజీఎఫ్ (KGF)1,2 సినిమాలతో పాన్ ఇండియా లెవల్‌లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు కన్నడ స్టార్ యష్(Yash). ప్రజెంట్ ఈయన ‘టాక్సిక్’(Toxic)తో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ హీరోకి సంబంధించి ఓ లేటెస్ట్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ‘టాక్సిక్’తో పాటు.. నితీష్ తివారి డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ‘రామాయణ’(Ramayana)లో కూడా నటిస్తున్నాడు. ఇందులో రాముడిగా బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) నటిస్తుండగా.. సీతగా నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) కనిపించనుంది. బాలీవుడ్ అగ్ర నిర్మాతలు భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ యష్ విలన్ పాత్ర అంటే రావణుడి రోల్‌లో కనిపించనున్నారు. అయితే.. ఈ పాత్రకు గాను యష్ దాదాపు రూ. 200 కోట్ల రెమ్యునరేషన్ (Remuneration)తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ వార్త ప్రజెంట్ నెట్టింట హాట్ టాపిక్‌గా వైరల్ అవుతుండగా.. హీరోగా కంటే విలన్‌గా కూడా అత్యధిక రెమ్మునరేషన్ తీసుకుంటున్న నటుడిగా చరిత్ర సృష్టించాడని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.