నేడు హై కోర్టుకి వర్కింగ్ డే: ఏపీ డీజీపీ

ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ నేడు పని చేస్తుందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. విధులకు హాజరుకావాల్సిన నేపథ్యంలో కోర్ట్ సిబ్బందికి, న్యాయవాదులకు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు నిబంధనల నుండి సడలింపునిచ్చామని ఆయన తెలిపారు. కోర్టు సిబ్బంది కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో వారు ప్రయాణించవచ్చని ఆయన వెల్లడించారు. ద్విచక్ర వాహనాలపై ఒక్కరు, కార్లలో డ్రైవర్ మినహా ఇద్దరికి, ఐడీ కార్డు పట్టుకుని ఆటోలో కోర్టుకు వెళ్తే వారికి ఒక్కరికీ మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. కోర్టు సిబ్బంది […]

Update: 2020-03-24 01:58 GMT

ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ నేడు పని చేస్తుందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. విధులకు హాజరుకావాల్సిన నేపథ్యంలో కోర్ట్ సిబ్బందికి, న్యాయవాదులకు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు నిబంధనల నుండి సడలింపునిచ్చామని ఆయన తెలిపారు. కోర్టు సిబ్బంది కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో వారు ప్రయాణించవచ్చని ఆయన వెల్లడించారు. ద్విచక్ర వాహనాలపై ఒక్కరు, కార్లలో డ్రైవర్ మినహా ఇద్దరికి, ఐడీ కార్డు పట్టుకుని ఆటోలో కోర్టుకు వెళ్తే వారికి ఒక్కరికీ మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. కోర్టు సిబ్బంది ఎవరైనా విధులకు హాజరు కావాల్సి ఉంటే.. వారు విధిగా తమ గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలని ఆయన స్పష్టం చేశారు. లేని పక్షంలో వారిని రోడ్లపై అనుమతించమని ఆయన ప్రకటించారు.
Tags: ap high court, court staff, court employees, high court not holiday, ap dgp, goutam savang

Tags:    

Similar News