నేడు భారత్ బంద్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా శుక్రవారం చేపట్టనున్న భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భారత్ బంద్‌ను పాటించాలని ఇటీవలే పేర్కొన్న సంగతి తెలిసిందే. భారత్ బంద్ సందర్భంగా దేశవ్యాప్తంగా రోడ్డు, రైల్ రోకోలు చేపట్టాలని తెలిపింది. వాణజ్య సముదాయాలను మూసేయాలని పిలుపిచ్చింది. అసెంబ్లీ ఎన్నికల కార్యక్రమాలకు మినహాయింపునిస్తున్నట్టు కర్షక నేతలు చెప్పారు. సంయుక్త కిసాన్ మోర్చా తొలిసారిగా గతేడాది డిసెంబర్ 8న భారత్ […]

Update: 2021-03-25 13:02 GMT

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా శుక్రవారం చేపట్టనున్న భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భారత్ బంద్‌ను పాటించాలని ఇటీవలే పేర్కొన్న సంగతి తెలిసిందే. భారత్ బంద్ సందర్భంగా దేశవ్యాప్తంగా రోడ్డు, రైల్ రోకోలు చేపట్టాలని తెలిపింది. వాణజ్య సముదాయాలను మూసేయాలని పిలుపిచ్చింది. అసెంబ్లీ ఎన్నికల కార్యక్రమాలకు మినహాయింపునిస్తున్నట్టు కర్షక నేతలు చెప్పారు. సంయుక్త కిసాన్ మోర్చా తొలిసారిగా గతేడాది డిసెంబర్ 8న భారత్ బంద్ చేపట్టింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, యూపీ, తమిళనాడు, అసోం సహా పలురాష్ట్రాల్లో మంచి స్పందన వచ్చింది. తాజాగా, ఢిల్లీలో రైతుల ఆందోళనలకు నాలుగు నెలలు నిండుతున్న సందర్భంలో భారత్ బంద్ పాటిస్తున్నట్టు రైతు నేత బూటా సింగ్ బుర్జ్‌గిల్ తెలిపారు.

ఈ బంద్‌ను విజయవంతం చేయటానికి అన్ని జిల్లాలు, బ్లాక్, తెహసిల్ అధ్యక్షలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. తాము ఇచ్చిన భారత్ బంద్ పిలుపునకు విస్తృతంగా మద్దతు లభిస్తున్నదని కిసాన్ మోర్చా నేతలు తెలిపారు. సంఘటిత, అసంఘటిత రంగాల కార్మిక సంఘాలు, వర్తకుల అసోసియేషన్లు, వర్కర్ల యూనియన్లు, ట్రాన్స్‌పోర్టర్, టీచర్ అసోసియేషన్లు, యువత, విద్యార్థుల నుంచి మద్దతు లభించిందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు నూతన సాగు సంస్కరణలు రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రంతో జరిపిన పది దఫాల సమావేశాలూ ఎటూ తేల్చకపోవడంతో ఆందోళనలను ఉధృతం చేస్తామని కిసాన్ మోర్చా ప్రకటించింది. ఈ నెల 28న హోలీ రోజున సాగు చట్టాల దస్త్రాలను తగులబెడతామనీ రైతు నేతలు తెలిపారు.

Tags:    

Similar News