ప్రమాదాలపై తెలంగాణ పోలీసు శాఖ కీలక నిర్ణయం..

దిశ, వెబ్‌డెస్క్ : రోడ్డు ప్రమాదాల నివారణకు తెలంగాణ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు జరిగి ఎవరైనా చనిపోతే అందుకు కారణమైన వారికి పదేళ్ల జైలు శిక్ష అమలయ్యేలా పోలీసుశాఖ కసరత్తు చేస్తోంది.రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు నిర్ణయించినట్లు పోలీసు విభాగం ప్రకటించింది. ఐపీసీలోని సెక్షన్ 304(2) కింద ప్రమాదానికి కారణమైన బాధ్యులపై కేసు నమోదు చేయాలని నిర్ణయించింది. ఇలా చేయడం ద్వారా కొంతమేరకైనా రోడ్డు […]

Update: 2021-01-01 20:56 GMT

దిశ, వెబ్‌డెస్క్ : రోడ్డు ప్రమాదాల నివారణకు తెలంగాణ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు జరిగి ఎవరైనా చనిపోతే అందుకు కారణమైన వారికి పదేళ్ల జైలు శిక్ష అమలయ్యేలా పోలీసుశాఖ కసరత్తు చేస్తోంది.రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు నిర్ణయించినట్లు పోలీసు విభాగం ప్రకటించింది.

ఐపీసీలోని సెక్షన్ 304(2) కింద ప్రమాదానికి కారణమైన బాధ్యులపై కేసు నమోదు చేయాలని నిర్ణయించింది. ఇలా చేయడం ద్వారా కొంతమేరకైనా రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చునని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News