ఇప్పుడు జగన్ కన్ను వాటిపై పడింది.. ప్రణవ్ గోపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలోని ఎయిడెడ్ విద్యాసంస్థలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ ఖండించారు. రాష్ట్రంలో మూసేయాల్సింది స్కూళ్లు కాదని.. మద్యం దుకాణాలు, ప్లేకాట క్లబ్బులు అని సూచించారు. యువతను మత్తుకు బానిసల్ని చేస్తోన్న గంజాయి స్థావరాల్ని మూసేయాలని ప్రజలు కోరుతుంటే వాటి‎ గురించి పట్టించుకోని సీఎం జగన్ పేదల కడుపునింపే అన్న క్యాంటీన్లు, పేద విద్యార్ధుల భవిష్యత్తులో వెలుగులు నింపే ఎయిడెడ్ పాఠశాలల్ని మూసేయటం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడేవి […]

Update: 2021-10-28 02:56 GMT

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలోని ఎయిడెడ్ విద్యాసంస్థలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ ఖండించారు. రాష్ట్రంలో మూసేయాల్సింది స్కూళ్లు కాదని.. మద్యం దుకాణాలు, ప్లేకాట క్లబ్బులు అని సూచించారు. యువతను మత్తుకు బానిసల్ని చేస్తోన్న గంజాయి స్థావరాల్ని మూసేయాలని ప్రజలు కోరుతుంటే వాటి‎ గురించి పట్టించుకోని సీఎం జగన్ పేదల కడుపునింపే అన్న క్యాంటీన్లు, పేద విద్యార్ధుల భవిష్యత్తులో వెలుగులు నింపే ఎయిడెడ్ పాఠశాలల్ని మూసేయటం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడేవి మూసేసి, ప్రజల భవిష్యత్‌ని నాశనం చేసే వాటిని ప్రోత్సహించటం బాధాకరమన్నారు. విద్యా రంగంలో ఘన చరిత్ర కలిగిన ఎయిడెడ్‌ విద్యా సంస్థలను మూసేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమన్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థలు మూతబడితే లక్షలాది మంది పేద విద్యార్థులకు విద్య దూరమవ్వడంతోపాటు రూ.వేల కోట్ల విలువైన భూములు అన్యక్రాంతం అవుతాయని ధ్వజమెత్తారు.

సంపద సృష్టించటం చేతకాక రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్తుల్ని అమ్ముతున్న జగన్‌కు ఇప్పుడు ఎయిడెడ్ విద్యాసంస్థల ఆస్తులపై కన్నుపడిందని ఆరోపించారు. ‎ ఎయిడెడ్ పాఠశాలలు మూసి వేసి వాటి ఆస్తుల్ని అమ్మి లేదా తాకట్టు పెట్టి అప్పులు తేవాలని జగన్ చూస్తున్నారు. అందుకే ఎయిడెడ్ పాఠశాలల్ని మూసేందుకు కుట్ర పన్నారు. మాకు అమ్మఒడి వద్దు మా స్కూలు మాకు కావాలని విద్యార్థులు నినదిస్తున్నారని తెలిపారు. స్వప్రయోజనాల కోసం విద్యార్థుల జీవితాల్ని బలి చేయొద్దని హితవు పలికారు. ఎయిడెడ్‌ విద్యా సంస్థలు ఇతర రాష్ట్రాల్లో ఎలా నడుస్తున్నాయో ప్రభుత్వం పరిశీలించాలి. ఎయిడెడ్‌ విద్యా సంస్థల భవనాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చాలని నూతన జాతీయ విద్యా విధానం స్పష్టంగా చెప్పింది. కేరళ ప్రభుత్వం ఆ విధంగానే చేస్తోంది. ప్రభుత్వం నిర్ణయం మార్చుకుని మన రాష్ట్రంలోని ఎయిడెడ్‌ విద్యా సంస్థలు నిలదొక్కుకోవడానికి అన్ని చర్యలూ తీసుకోవాలి, లేకుంటే విద్యార్థుల తరపున పోరాటం చేస్తామని టీఎన్ఎస్ఎఫ్ ప్రణవ్ గోపాల్ హెచ్చరించారు.

Tags:    

Similar News