18 దేశాలకు అధ్యక్షులను ప్రకటించిన టీటా
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ టెక్కీల వేదికగా నిలుస్తున్న తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) తాజాగా వివిధ దేశాల్లోని కమిటీల అధ్యక్షులను ప్రకటించింది. మాతృభూమికి సేవ చేయడం, ఆయా దేశాల్లో కొత్తగా వచ్చిన వారికి, నివసిస్తున్న వారికి అందిస్తున్న సహాయ సహకారాలు సహా వివిధ అంశాలు పరిగణనలోకి తీసుకొని తొలి దశలో 18 దేశాల అధ్యక్షులను టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా పెండింగులో […]
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ టెక్కీల వేదికగా నిలుస్తున్న తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) తాజాగా వివిధ దేశాల్లోని కమిటీల అధ్యక్షులను ప్రకటించింది. మాతృభూమికి సేవ చేయడం, ఆయా దేశాల్లో కొత్తగా వచ్చిన వారికి, నివసిస్తున్న వారికి అందిస్తున్న సహాయ సహకారాలు సహా వివిధ అంశాలు పరిగణనలోకి తీసుకొని తొలి దశలో 18 దేశాల అధ్యక్షులను టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా పెండింగులో పెట్టిన వివిధ దేశాల కమిటీలను త్వరలో ప్రకటించనున్నట్లు వెల్లడించారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీటా చాప్టర్లు అనేక సేవా కార్యక్రమాలను ఇటు స్వదేశంలో అటు విదేశాల్లో చేపట్టాయి. అనేక సంక్లిష్ట సమస్యల్లో బాధిత కుటుంబాలకు అండగా నిలిచాయి. మెక్సికో దేశంలో తెలంగాణ సంస్కృతిని పరిచయం చేయడమే కాకుండా స్థానిక మెక్సికన్లు బతుకమ్మ ఆడేలా ఆ దేశ కమిటీ కృషి చేసింది. ఆగస్టు 4వ తేదీన సింగపూర్‌లో తెలుగు టెక్కీ విజయ్ కుమార్ యేగళ్ల మరణించగా.. వారాంతమైనప్పటికీ అక్కడి టీటా కమిటీ సింగపూర్, భారత రాయబార కార్యాలయం, తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదించి 24 గంటలలో భౌతికకాయం స్వదేశానికి చేరేలా కృషి చేసింది. అమెరికాలో గత ఏడాది రాజ్‌కరణ్ అనే వ్యక్తి మరణించిన సమయంలోనూ ఇదే రీతిలో టీటా అమెరికా చాప్టర్ స్పందించి ఇంటి వద్దకు ఆయన భౌతిక కాయాన్ని చేర్చింది. ఉన్నత విద్య అభ్యసన కోసం వివిధ దేశాలకు వెళ్లిన విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా కోర్సులను ఉచితంగా నేర్పించారు.
పలు కోర్సుల్లో ఉచిత శిక్షణ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ మార్కెటింగ్ వంటి లక్షల్లో ఖర్చయ్యే కోర్సులను ఉచితంగా అందించినట్లు టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మక్తాల చెప్పారు. దీంతో పాటుగా తమ మాతృభూమికి సేవ చేయాలనే లక్ష్యంతో ఎన్నో గ్రామాలను డిజిటల్ అక్షరాస్యతలో భాగం చేసేందుకు కంప్యూటర్లు, ప్రింటర్లు, ప్రొజెక్టర్లు వంటివి ఉచితంగా అందించారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు తదుపరి విద్యాభ్యాసం కోసం రూ.2,24,000 ఆర్థిక సాయం అందించి వారికి కొత్త అవకాశాలు అందించినట్లు తెలిపారు.
18 దేశాలకు కమిటీలు
18 దేశాలకు సంబంధించిన కమిటీల అధ్యక్షులను టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల ప్రకటించారు. 2019-20లో చేసిన కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకొని నియామకాలు చేసినట్లు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా టీటా సభ్యులు తమకు అండగా ఉంటారనే భరోసా తెలంగాణ టెకీలలో కల్పించేందుకు తమ గ్లోబల్ కమిటీలోని సభ్యులు నిరంతరం శ్రమిస్తున్నట్లు తెలిపారు. తెలుగు టెక్కీలు క్రియాశీలంగా ఉన్న దేశాల్లోనూ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఆయా దేశాల్లో కమిటీలను ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తికల వారు bit.ly/tita_nomination లింక్ ద్వారా నామినేషన్ వేసుకోవచ్చునన్నారు. నూతన ఎన్నారై చాప్టర్లు 2021లో యాక్టివ్‌గా పని చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ కారణంగా కొన్ని కమిటీలకు బాధ్యులను ప్రకటించడం లేదని పేర్కొన్నారు.
టీటా చాప్టర్ల దేశాలు – కొత్త అధ్యక్షులు
1. అమెరికా – మనోజ్ తాటికొండ
2. యూకే – విశ్వక్ లక్కిరెడ్డి
3. కెనడా – రంజిత్ గవ్వల
4. దుబాయ్ – నరేష్ మందుల
5. కువైట్ – సమీయుద్దీన్
6. మలేషియా – జయచంద్ర
7. మెక్సికో – రమేష్ సిలివేరి
8. ఉరుగ్వే – సతీష్
9. బ్రెజిల్ – నిరంజన్ బైరబోయిన
10. సింగపూర్ – సంతోష కళా
11. సౌత్ ఆఫ్రికా – కిశోర్ పుల్లూరి
12. పారిస్ – శివానంద కౌండిన్య
13. ఆస్ట్రేలియా – నరేష్ లాలా
14. నెదర్లాండ్స్ – వికాస్ జగ్పత్
15. ఐర్లాండ్ – వివేక్ చింతలగట్టు
16. జర్మనీ – గంగపుత్ర రాజన్
17. చైనా & హాంకాంగ్ – రవి కలదురు
18. ఇటలీ – సాయి అఖిల్ ఆదిత్య కాకూరి