ఆకు కూరలతో మీ కేశాలకు రక్షణ..

దిశ, వెబ్ డెస్క్: ఆకు కూరలు ఆరోగ్యానికి మంచివన్న విషయం అందరికీ తెలుసు. కాని కేశాలకు(జుట్టు) వాటిని అప్లై చేయడం ద్వారా నిగారింపు వచ్చి, కేశాలు ఆరోగ్యంగా ఉంటాయన్న విషయం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. చుండ్రు, జుట్టురాలడం నివారించేందుకు ఇవి ఉపయోగపడతాయి. రసాయనాలు కాకుండా ప్రకృతిలో దొరికే ఆకుకూరలతో మీ కేశాలకు రక్షణ ఉంటుంది. ఆ చిట్కాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం.. జుట్టు రాలడం, చుండ్రు తగ్గేందుకు.. ఒక కప్పు పొనగంటి కూర, ఒక కప్పు గోరింటాకు […]

Update: 2020-04-08 04:48 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆకు కూరలు ఆరోగ్యానికి మంచివన్న విషయం అందరికీ తెలుసు. కాని కేశాలకు(జుట్టు) వాటిని అప్లై చేయడం ద్వారా నిగారింపు వచ్చి, కేశాలు ఆరోగ్యంగా ఉంటాయన్న విషయం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. చుండ్రు, జుట్టురాలడం నివారించేందుకు ఇవి ఉపయోగపడతాయి. రసాయనాలు కాకుండా ప్రకృతిలో దొరికే ఆకుకూరలతో మీ కేశాలకు రక్షణ ఉంటుంది. ఆ చిట్కాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం..

జుట్టు రాలడం, చుండ్రు తగ్గేందుకు..

ఒక కప్పు పొనగంటి కూర, ఒక కప్పు గోరింటాకు పౌడర్, రెండు చెంచాల మెంతు పౌడర్, అరకప్పు పెరుగు, ఒక చెంచా నిమ్మ రసం, నీళ్లు కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు రాలడం, చుండ్రు తగ్గుతుంది.

నిగనిగలాడేందుకు..

చుక్కకూర ఒక కప్పు, గోరింటాకు పొడి కప్పు, రెండు స్పూన్‌ల మట్టి, కప్పు పెరుగు బాగా కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత కడిగేయాలి. దీని వల్ల జుట్టు నిగనిగలాడుతుంది.

కండీషనరింగ్..

మజ్జిగలో చింతచిగురు, గోరింటాకుపొడి ఒక్కొక్క కప్పు తీసుకుని దాంట్లో అరకప్పుశనగపిండిని కలపాలి. దాన్ని మాడకు పట్టించాలి. 20 నిమిషాల తర్వాత తలను కడిగేయాలి. ఇది జుట్టుకు మంచి కండీషనర్‌లా పనిచేస్తుంది. అయితే, ఈ మిశ్రమాన్ని పెట్టుకునే ముందు తలకు నూనె పెట్టుకోవాలి. తలకు నూనె పెట్టుకున్న తర్వాత మర్దనా చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి.

అవిసె ఆకులు రెండు కప్పులు, గోరింటాకు కప్పు, ఉసిరి పౌడర్ అరకప్పు వేసి పేస్ట్‌లా తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 20 నిమిషాల తర్వాత గోరు నీటితో కడిగేయాలి. ఇది వేడిని దూరం చేస్తుంది.

మంచి రంగు కోసం..

గోరింటాకు పౌడర్‌లో ఒక స్పూన్ లవంగాల పౌడర్, కప్పు డికాషన్, కోడిగుడ్డు, కొంచెం పెరుగు, ఒక స్పూన్ ఆముదం నూనె కలిపి తలకు పెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఆ తర్వాత నూనె రాసి మర్దన చేసుకోవాలి. దీని వల్ల తెల్ల జుట్టు నుంచి మంచి రంగు వస్తుంది. జుట్టు రాలకుండా ఉంటుంది.

Tags: hair, greens, healthy, conditioning

Tags:    

Similar News