భారత ఆర్థిక వ్యవస్థ ఇంకా 2019 స్థాయి కంటే దిగువనే ఉంది: అభిజిత్ బెనర్జీ!

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రాహీత అభిజిత్ బెనర్జీ భారత ఆర్థిక వ్యవస్థ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ప్రజలు తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారని, భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ 2019 స్థాయిల కంటే దిగువనే ఉందని, ప్రజల్లో ఉండే చిన్న చిన్న కోరికలు కూడా మరింత క్షీణిస్తున్నాయని, ఈ పరిస్థితికి ఎవరూ బాధ్యులు కారని అభిప్రాయపడ్డారు. అహ్మదాబాద్ యూనివర్సిటీ 11వ వార్షిక స్నాతకోత్సవం సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. విద్యార్థులు సమాజానికి […]

Update: 2021-12-05 05:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రాహీత అభిజిత్ బెనర్జీ భారత ఆర్థిక వ్యవస్థ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ప్రజలు తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారని, భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ 2019 స్థాయిల కంటే దిగువనే ఉందని, ప్రజల్లో ఉండే చిన్న చిన్న కోరికలు కూడా మరింత క్షీణిస్తున్నాయని, ఈ పరిస్థితికి ఎవరూ బాధ్యులు కారని అభిప్రాయపడ్డారు.

అహ్మదాబాద్ యూనివర్సిటీ 11వ వార్షిక స్నాతకోత్సవం సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. విద్యార్థులు సమాజానికి తిరిగి ఇవ్వగల స్థానంలో ఉన్నారు. అదిప్పుడు చాలా అవసరం. ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటోంది. విద్యార్థులందరూ తమ లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. కుటుంబం, సమాజం నుంచి ఎదురయ్యే ఒత్తిడికి లోను కావద్దని, జీవితంలో మీరు ఎంచుకునే లక్ష్యం దిశగా వెళ్లే ధైర్యం చేయాలని సూచించారు.

ఢిలీలోని జేఎన్‌యూలో తాను చదువుకునే సమయంలో 10 రోజుల పాటు జైల్లో గడిపానని, ఆ సమయంలో హార్వార్డ్ యూనివర్శిటీకి వెళ్లాలనే తన లక్ష్యం నెరవేరదని చాలామంది భయపెట్టారని, కానీ అలా జరగలేదని ఆయన పేర్కొన్నారు. కెరీర్‌ను ఎంచుకునే ఆలోచనకు సంబంధించి భారత అత్యుత్తమ దర్శకులైన సత్యజిత్ రే, శ్యామ్ బెనగల్ ఇద్దరూ ఆర్థిక శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ చేశారని, కానీ వారు వేరే రంగాల్లో అత్యుత్తమంగా రాణించారని విద్యార్థులకు వివరించారు.

Tags:    

Similar News