వందేళ్ల చరిత్రలో మొదటిసారి టైమ్ కవర్ ప్రింట్‌లో మార్పు… ఎందుకు?
దిశ, వెబ్‌డెస్క్ : టైమ్ మేగజైన్ ప్రతిష్టాత్మకమైనదని అందరికీ తెలుసు. ఆ పేరు వినగానే కవర్ పేజీ మీద టైమ్ అనే పదంతో ఉన్న మేగజైన్ కవర్ గుర్తొస్తుంది. గత వందేళ్ల నుంచి అదే పేరుతో అదే లోగో డిజైన్‌తో ప్రింట్ అవుతోంది కాబట్టి ఆ మేగజైన్ పేరు చెప్పగానే కవర్ పేజీ అలాగే గుర్తొస్తుంది. కానీ అమెరికాలో విడుదలైన నవంబర్ ఎడిషన్‌ను చూస్తే మాత్రం టైమ్‌కు బదులుగా ‘ఓట్’ అనే పదం స్పెల్లింగ్ కనిపిస్తోంది. ఇలా […]
దిశ, వెబ్‌డెస్క్ : టైమ్ మేగజైన్ ప్రతిష్టాత్మకమైనదని అందరికీ తెలుసు. ఆ పేరు వినగానే కవర్ పేజీ మీద టైమ్ అనే పదంతో ఉన్న మేగజైన్ కవర్ గుర్తొస్తుంది. గత వందేళ్ల నుంచి అదే పేరుతో అదే లోగో డిజైన్‌తో ప్రింట్ అవుతోంది కాబట్టి ఆ మేగజైన్ పేరు చెప్పగానే కవర్ పేజీ అలాగే గుర్తొస్తుంది. కానీ అమెరికాలో విడుదలైన నవంబర్ ఎడిషన్‌ను చూస్తే మాత్రం టైమ్‌కు బదులుగా ‘ఓట్’ అనే పదం స్పెల్లింగ్ కనిపిస్తోంది. ఇలా ఎందుకు మార్చాల్సి వచ్చిందనే విషయం గురించి టైమ్ యాజమాన్యం స్పష్టతనిచ్చింది. 2020 సంవత్సరం ప్రతి ఒక్కరికీ దుర్భరంగా గడిచిందని, అందరి జీవితాలకు ఈ ఏడాది ఒక రీసెట్ బటన్‌లాగ పనిచేసిందని, అందుకే తాము కూడా ఒక చిన్న మార్పుతో సకారాత్మక దృష్టిని ప్రజల్లో పెంపొందించడానికి ప్రయత్నించినట్లు టైమ్ తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది.
నవంబర్ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పడానికే తాము ఇలా లోగో అక్షరాలను మార్చినట్లు ఎడిటర్ ఇన్ చీఫ్, సీఈవో ఎడ్వర్డ్ ఫెల్సెంతాల్ తెలిపారు. 2020వ సంవత్సరం అందరి జీవితాలను రీసెట్ చేసినట్లే, అమెరికా భవితవ్యాన్ని కూడా ఈ ఎన్నికల ద్వారా రీసెట్ చేయగల అవకాశాన్ని అందరూ ఉపయోగించుకునే ఉద్దేశంతో కవర్ పేజీని డిజైన్ చేసినట్లు చెప్పారు. ఈ కవర్ పేజీ మీద ఆర్ట్‌వర్క్‌ను షెఫర్డ్ ఫైయిరీ డిజైన్ చేశారు. 2008లో మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా కోసం ‘హోప్’ పదం అక్షరాలతో పోస్టర్‌ను డిజైన్ చేసింది కూడా షెఫర్డ్ ఫైయిరీ కావడం గమనార్హం.