స్లాప్ యువర్ టీచర్.. వైరల్‌గా టిక్ టాక్‌ చాలెంజ్

దిశ, ఫీచర్స్: టిక్ టాక్‌లో నెలకో చాలెంజ్ పుట్టుకొస్తుంటుంది. అవి సోషల్ మీడియాలో వైరల్ అయిపోయి ప్రపంచవ్యాప్తంగా హల్ చల్ చేస్తుంటాయి. ఈ క్రమంలోనే ‘స్లాప్ యువర్ టీచర్’ అనే కొత్త చాలెంజ్‌ లేటెస్ట్ ట్రెండ్‌గా మారింది. ఇందులో భాగంగా యూఎస్‌లోని లూసియానాలో 18 ఏళ్ల ఫిమేల్ స్టూడెంట్.. వికలాంగుడైన 64 ఏళ్ల టీచర్‌ ముఖం పగలగొట్టేసింది. ఈ అటాక్‌తో సిక్ అయిన వ్యక్తి హాస్పిటల్‌లో జాయిన్ కాగా.. పోలీసులు ఆ అమ్మాయిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. […]

Update: 2021-10-10 04:54 GMT

దిశ, ఫీచర్స్: టిక్ టాక్‌లో నెలకో చాలెంజ్ పుట్టుకొస్తుంటుంది. అవి సోషల్ మీడియాలో వైరల్ అయిపోయి ప్రపంచవ్యాప్తంగా హల్ చల్ చేస్తుంటాయి. ఈ క్రమంలోనే ‘స్లాప్ యువర్ టీచర్’ అనే కొత్త చాలెంజ్‌ లేటెస్ట్ ట్రెండ్‌గా మారింది. ఇందులో భాగంగా యూఎస్‌లోని లూసియానాలో 18 ఏళ్ల ఫిమేల్ స్టూడెంట్.. వికలాంగుడైన 64 ఏళ్ల టీచర్‌ ముఖం పగలగొట్టేసింది. ఈ అటాక్‌తో సిక్ అయిన వ్యక్తి హాస్పిటల్‌లో జాయిన్ కాగా.. పోలీసులు ఆ అమ్మాయిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సౌత్ కరోలినాలోని ఎలిమెంటరీ స్కూల్‌లో జరిగిన దాడిలో టీచర్‌ మెడ పట్టుకోగా.. చాలా చోట్ల ఇలాంటి దాడులు పెరిగిపోయాయని మీడియా ప్రచురించింది. ఈ చాలెంజ్ యూఎస్ అంతటా స్ప్రెడ్ కావడంతో గురువులు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుండగా.. ఈ పరిస్థితిపై ‘నేషనల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్’ ఫేస్ బుక్, టిక్ టాక్, ట్విట్టర్‌లకు ఓపెన్ లెటర్ రాసింది. తమ అల్గారిథమ్స్ ఫిక్స్ చేసుకోవాలని, ఇలాంటి కాంట్రవర్షియల్ వైరల్ చాలెంజ్‌లు, ఫాల్స్ ఇన్‌ఫర్మేషన్స్‌కు చోటు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.

Tags:    

Similar News