భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దపులి జాడలు
దిశ ప్రతినిధి, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దపులి జాడలు కలకలం రేపుతున్నాయి. కరకగూడెం, గుండాల మండలాల సరిహద్దు అటవీ ప్రాంతంలో పెద్దపులి జాడలు గమనించినట్లు వీరాపురం గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అటవీశాఖ సిబ్బంది, వైల్డ్ లైఫ్ సిబ్బంది పెద్దపులి కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది. పద్మాపురం అటవీ ప్రాంతం పరిధిలో నీలాద్రిపేట గండి వలస ఆదివాసీలకు జంతువులకు సంబంధించిన ఉచ్చులు ఏర్పాటు చేయవద్దని అధికారులు తెలిపారు. పెద్దపులి సంచారం చేస్తున్న నేపథ్యంలో స్థానికులు […]
దిశ ప్రతినిధి, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దపులి జాడలు కలకలం రేపుతున్నాయి. కరకగూడెం, గుండాల మండలాల సరిహద్దు అటవీ ప్రాంతంలో పెద్దపులి జాడలు గమనించినట్లు వీరాపురం గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అటవీశాఖ సిబ్బంది, వైల్డ్ లైఫ్ సిబ్బంది పెద్దపులి కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది. పద్మాపురం అటవీ ప్రాంతం పరిధిలో నీలాద్రిపేట గండి వలస ఆదివాసీలకు జంతువులకు సంబంధించిన ఉచ్చులు ఏర్పాటు చేయవద్దని అధికారులు తెలిపారు. పెద్దపులి సంచారం చేస్తున్న నేపథ్యంలో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.