బంగారం దొంగతనం కేసులో మహిళకు మూడేళ్ల జైలు

దిశ, క్రైమ్ బ్యూరో : బంగారం దుకాణాలలో పలు చోరీలకు పాల్పడిన మహిళకు మూడేళ్ల జైలు శిక్ష ఖరారైంది. బంగారం వస్తువుల కొనుగోలు పేరుతో చైతన్యపురి ఖాజానా జ్యువెలరీ దుకాణంలో సేల్స్ మేన్ బిజీగా ఉండడాన్ని గమనించిన రేఖా అనే మహిళా 2018లో 48.39 గ్రాముల బంగారపు చైన్‌ను తస్కరించింది. రేఖ గతంలో సరూర్ నగర్ లోని మలబార్ గోల్డ్ దుకాణంతో పాటు పంజాగుట్ట, ఎస్సార్ నగర్ ప్రాంతాల్లోని నగల దుకాణాల్లో సైతం చోరీలకు పాల్పడినట్లు విచారణలో […]

Update: 2021-03-23 11:22 GMT

దిశ, క్రైమ్ బ్యూరో : బంగారం దుకాణాలలో పలు చోరీలకు పాల్పడిన మహిళకు మూడేళ్ల జైలు శిక్ష ఖరారైంది. బంగారం వస్తువుల కొనుగోలు పేరుతో చైతన్యపురి ఖాజానా జ్యువెలరీ దుకాణంలో సేల్స్ మేన్ బిజీగా ఉండడాన్ని గమనించిన రేఖా అనే మహిళా 2018లో 48.39 గ్రాముల బంగారపు చైన్‌ను తస్కరించింది. రేఖ గతంలో సరూర్ నగర్ లోని మలబార్ గోల్డ్ దుకాణంతో పాటు పంజాగుట్ట, ఎస్సార్ నగర్ ప్రాంతాల్లోని నగల దుకాణాల్లో సైతం చోరీలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. దీంతో కేసు నమోదు చేసిన చైతన్యపురి పోలీసులు ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును విచారించిన ఎల్‌బీ నగర్ 6వ ఎంఎం కోర్టు న్యాయమూర్తి మంగళవారం మూడేళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తున్నట్లు తీర్పు ప్రకటించారు.

Tags:    

Similar News