ఒకే నెలలో ముగ్గురు మృతి.. అయినా నో యాక్షన్
దిశ, ములకలపల్లి: విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి ప్రజల ప్రాణాలతో పాటు మూగ జీవాలు కూడా బలవుతున్నాయి. రక్షణ వలయం లేని ట్రాన్స్ ఫార్మార్ల మూలంగా ప్రతీ ఏడాది పదుల సంఖ్యలో పశువులు విద్యుత్ ప్రమాదానికి గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. విద్యుత్ లైన్‌ను ఇండ్ల మధ్యలో నుంచి వేయడం గమనార్హం. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల కాలంలో విద్యుత్ షాక్‌కు గురై మండలానికి చెందిన మిద్దె రాంబాబు(35), జాన్ బాబు(26), పాయం దుర్గారావు(36)లు అక్కడికక్కడే మృతిచెందారు. […]
దిశ, ములకలపల్లి: విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి ప్రజల ప్రాణాలతో పాటు మూగ జీవాలు కూడా బలవుతున్నాయి. రక్షణ వలయం లేని ట్రాన్స్ ఫార్మార్ల మూలంగా ప్రతీ ఏడాది పదుల సంఖ్యలో పశువులు విద్యుత్ ప్రమాదానికి గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. విద్యుత్ లైన్‌ను ఇండ్ల మధ్యలో నుంచి వేయడం గమనార్హం. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల కాలంలో విద్యుత్ షాక్‌కు గురై మండలానికి చెందిన మిద్దె రాంబాబు(35), జాన్ బాబు(26), పాయం దుర్గారావు(36)లు అక్కడికక్కడే మృతిచెందారు. గడిచిన వారంలో రెండు పశువులు కూడా మృతిచెందాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఇండ్ల మధ్యలోనే ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేయడం, వాటి చుట్టూ ఎలాంటి రక్షణ వలయం లేకపోవడంతో మేతకు వెళ్లిన పశువులు సైతం మృత్యువాత పడుతున్నాయి. మండల కేంద్రానికి సమీపంలో ఉన్న రాజుపేట గ్రామంలో ఈ నెల 23న ఒక ఆవు మృతి చెందింది. అదేవిధంగా 24న రామచంద్రాపురంలో మరో గేదె మృతిచెందింది. దీంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండ్ల మధ్యలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ ఫార్మార్లకు రక్షణ వలయాలు అమర్చాలని, అప్పుడే ప్రమాదాలు నివారించొచ్చని స్థానికులు అంటున్నారు.