దళిత బంధు అమలుపై మరో ట్విస్ట్..
దిశ, వెబ్‌డెస్క్ : దళిత బంధు ప్రవేశ పెడుతున్నాం అని టీఆర్ఎస్ ప్రకటించినప్పటి నుంచి ప్రభుత్వానికి ఇది ఓ తల నొప్పిగా మారింది. ప్రతి పక్షాల నుంచి ఎన్నో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. హుజురాబాద్ ఓటర్లను టార్గెట్ చేసే ఈ పథకం ప్రవేశపెట్టారంటూ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు కొందరు. ఈ నేపథ్యంలో దళిత బంధు అమలుపై మరో ట్విస్ట్ నెలకొంది. దళిత బంధుపై హైకోర్టు ను ఆశ్రయించారు పలువురు విపక్ష నేతలు. దళితబంధుపై మూడు పిటిషన్లు దాఖలు […]
దిశ, వెబ్‌డెస్క్ : దళిత బంధు ప్రవేశ పెడుతున్నాం అని టీఆర్ఎస్ ప్రకటించినప్పటి నుంచి ప్రభుత్వానికి ఇది ఓ తల నొప్పిగా మారింది. ప్రతి పక్షాల నుంచి ఎన్నో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. హుజురాబాద్ ఓటర్లను టార్గెట్ చేసే ఈ పథకం ప్రవేశపెట్టారంటూ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు కొందరు. ఈ నేపథ్యంలో దళిత బంధు అమలుపై మరో ట్విస్ట్ నెలకొంది. దళిత బంధుపై హైకోర్టు ను ఆశ్రయించారు పలువురు విపక్ష నేతలు.
దళితబంధుపై మూడు పిటిషన్లు దాఖలు చేశారు. హుజురాబాద్‌లో దళిత బంధు యథావిధిగా కొనసాగించాలని నేతలు పిటిషన్‌లో కోరారు. దళిత బంధుకు తాము వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. ఇందులో ప్రతివాదులుగా కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తో పాటు కరీంనగర్ జిల్లా కలెక్టర్, హుజురాబాద్ రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ సీపీని చేర్చారు పిటిషనర్లు.