అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా.. ముగ్గురు మృతి

దిశ, జుక్కల్: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం చిన్నదేవడాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వివాహ వేడుకల సందర్భంగా గురువారం తెల్లవారుజామున ట్రాక్టర్‌పై నీరు తీసుకుని వస్తుండగా.. ట్యాంకర్ ఒకసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తుకారం, సాయిలు, శంకర్‌గా అక్కడికక్కడే మరణించారు.ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం […]

Update: 2020-12-16 21:03 GMT

దిశ, జుక్కల్: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం చిన్నదేవడాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

వివాహ వేడుకల సందర్భంగా గురువారం తెల్లవారుజామున ట్రాక్టర్‌పై నీరు తీసుకుని వస్తుండగా.. ట్యాంకర్ ఒకసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తుకారం, సాయిలు, శంకర్‌గా అక్కడికక్కడే మరణించారు.ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News