దారుణం: మందుపార్టీకి పిలిచి.. మట్టుబెట్టారు
దిశ, చార్మినార్: తనను చోరీ కేసులో పోలీసులకు పట్టించాడన్న అనుమానంతో పాటు సోషల్ మీడియాలోను దొంగగా చిత్రీకరిస్తున్నాడని ఓ యువకునిపై పాతనేరస్థుడు కక్ష్యతో రగిలిపోయాడు. అదును చూసి మందు పార్టీ అంటూ పిలిచి చిత్తుగా ఆ యువకునికి మద్యం తాగించారు. మత్తులో చేరుకున్న యువకున్ని కత్తితో అతి దారుణంగా హత్యచేసి తప్పించుకు తిరుగుతున్న ముగ్గురు యువకులను హుస్సేనిహాలం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సౌత్ జోన్ డిసిపి గజరావు భూపాల్ వెల్లడించారు. దక్షిణమండలం డిసిపి కార్యాలయంలో […]
దిశ, చార్మినార్: తనను చోరీ కేసులో పోలీసులకు పట్టించాడన్న అనుమానంతో పాటు సోషల్ మీడియాలోను దొంగగా చిత్రీకరిస్తున్నాడని ఓ యువకునిపై పాతనేరస్థుడు కక్ష్యతో రగిలిపోయాడు. అదును చూసి మందు పార్టీ అంటూ పిలిచి చిత్తుగా ఆ యువకునికి మద్యం తాగించారు. మత్తులో చేరుకున్న యువకున్ని కత్తితో అతి దారుణంగా హత్యచేసి తప్పించుకు తిరుగుతున్న ముగ్గురు యువకులను హుస్సేనిహాలం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సౌత్ జోన్ డిసిపి గజరావు భూపాల్ వెల్లడించారు. దక్షిణమండలం డిసిపి కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో అడీషనల్ డిసిపి సయ్యద్ రఫిక్, చార్మినార్ ఏసిపి భిక్షం రెడ్డి, ఇన్ స్పెక్టర్లు దుర్గాప్రసాద్, నరేష్కుమార్, చక్రవర్తిలతో కలిసి హుస్సేనిహాలం, బహదూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలలో సంచలనం సృష్టించిన హత్య కేసులలో వివరాలను వెల్లడించారు.
ఫతేదర్వాజా కు చెందిన బట్టల షాపులో పని చేసే సాలం బిన్ అబ్దుల్లా బాస్లుమ్ (23) ఓ దొంగతనం కేసులో అంబర్ పేట్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇటీవలే బెయిల్ పై వచ్చిన సాలం బిన్ తనను పోలీసులకు బహదూర్ పురా కుచెందిన పండ్ల వ్యాపారి సయ్యద్ జుబేర్ ఎలియాస్ కచ్రా జుబేర్(22) పట్టించాడని మనసులో కక్ష్య పెంచుకున్నాడు. అంతేగాకుండా జుబేర్ సోషల్ మీడియాలో దొంగగా చిత్రీకరిస్తూ పోస్ట్‌లు పెడుతున్నాడని, జుబేర్ ను ఎలాగైనా మట్టుపెట్టాలని పథకం వేశాడు. దీంతో ఫతేదర్వాజా కు చెందిన పాతనేరస్థుడు మహ్మద్ ముజాఫర్ ఆలీఖాన్(19) , చాంద్రాయణగుట్టకు చెందిన తారిఖ్ ఆలీ(19) లతో కలిసి పథకం రచించాడు.
ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఈ నెల 12 వతేదీన అర్థరాత్రి జుబేర్‌ను మందు పార్టీ అంటూ షాలిబండా లోని ఆషాథియేటర్ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న భవనానికి తీసుకెళ్లారు. అక్కడ సాలం బిన్, మహ్మద్ ముజాఫర్ ఆలీ, తారీఖ్ ఆలిలు జుబేర్‌తో చిత్తుగా మద్యం తాగించారు. అనంతరం ఆటను మద్యం మత్తులో ఉన్నప్పుడు కత్తితో అతి దారుణంగా హతమార్చారు. అప్పటి నుంచి తప్పించుకుతిరుగుతున్న సాలం బిన్, మహ్మద్ ముజాఫర్ ఆలీ, తారీఖ్ ఆలిలను పోలీసులు అరెస్ట్ చేశారు.