పేకాట ఆడుతూ పట్టుబడ్డ పోలీసులు

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో పేకాట ఆడుతూ ముగ్గురు కానిస్టేబుళ్లు పట్టుబడ్డారు. కోటగల్లిలో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు నాల్గవ టౌన్ ఎస్ఐ సతీష్ ఆధ్వర్యంలో రైడ్స్‌ చేశారు. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులు పట్టుబడ్డారు. వారిలో కృష్ణం రాజు, ప్రసాద్, నాగరాజు పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ళుగా విధులు నిర్వహిస్తున్నట్టు తేలింది. ప్రసాద్ స్పెషల్ బ్రాంచ్‌లో, నాగారాజు రెండవ టౌన్ పోలిస్ స్టేషన్‌లో, కృష్ణం రాజు మహిళా పోలిస్ స్టేషన్ విధులు నిర్వహిస్తున్నారని […]

Update: 2021-01-25 09:58 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో పేకాట ఆడుతూ ముగ్గురు కానిస్టేబుళ్లు పట్టుబడ్డారు. కోటగల్లిలో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు నాల్గవ టౌన్ ఎస్ఐ సతీష్ ఆధ్వర్యంలో రైడ్స్‌ చేశారు. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులు పట్టుబడ్డారు. వారిలో కృష్ణం రాజు, ప్రసాద్, నాగరాజు పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ళుగా విధులు నిర్వహిస్తున్నట్టు తేలింది. ప్రసాద్ స్పెషల్ బ్రాంచ్‌లో, నాగారాజు రెండవ టౌన్ పోలిస్ స్టేషన్‌లో, కృష్ణం రాజు మహిళా పోలిస్ స్టేషన్ విధులు నిర్వహిస్తున్నారని అధికారులు తెలిపారు. పట్టుబడ్డ సమయంలో వారి నుంచి రూ.40 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే, పేకాట ఆడుతూ పోలీసులే పట్టుబడ్డారన్న వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News