అడ్డొచ్చిన అన్నను కూడా కొట్టి రూ. 45 వేలు ఎత్తుకెళ్లిన దుండగులు
దిశ, బంజారాహిల్స్: బైక్ పై వెళ్తున్న వ్యక్తిని కొందరు ఆకతాయిలు అడ్డగించి అకారణంగా దాడిచేసి రూ. 45 వేలు లాకున్న సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… టోలిచౌకి సమీపంలోని పారామౌంట్‌కాలనీలో నివసించే సయ్యద్ అలీ హుస్సేన్(17) ఈ నెల 13వ తేదీ రాత్రి 11 గంటలకు బైక్‌పై సయ్యద్‌నగర్‌లో వర్కర్‌కు డబ్బులు ఇచ్చేందుకు బయలుదేరాడు. ఈ క్రమంలో సయ్యద్‌నగర్ చిల్లా వద్దకు రాగానే ఆరుమంది యువకులు రోడ్డుకు అడ్డంగా […]
దిశ, బంజారాహిల్స్: బైక్ పై వెళ్తున్న వ్యక్తిని కొందరు ఆకతాయిలు అడ్డగించి అకారణంగా దాడిచేసి రూ. 45 వేలు లాకున్న సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… టోలిచౌకి సమీపంలోని పారామౌంట్‌కాలనీలో నివసించే సయ్యద్ అలీ హుస్సేన్(17) ఈ నెల 13వ తేదీ రాత్రి 11 గంటలకు బైక్‌పై సయ్యద్‌నగర్‌లో వర్కర్‌కు డబ్బులు ఇచ్చేందుకు బయలుదేరాడు. ఈ క్రమంలో సయ్యద్‌నగర్ చిల్లా వద్దకు రాగానే ఆరుమంది యువకులు రోడ్డుకు అడ్డంగా నిలబడి హుస్సేన్‌ను అడ్డగించారు. వెంటనే అసభ్యపదజాలంతో దూషిస్తూ అకారణంగా అతనిపై దాడి చేశారు. వెంటనే బాధితుడు తన సోదరుడు సయ్యద్ అబ్రార్ హుస్సేన్‌కు సమాచారం ఇచ్చాడు. హుటాహుటిన అబ్రార్ హుస్సేన్ తన స్నేహితుడు సొహైల్‌తో కలిసి సయ్యద్‌నగర్ చిల్లా వద్దకు చేరుకొని తన తమ్ముడిని ఎందుకు కొట్టారంటూ నిలదీశాడు. సమాధానం చెప్పకుండానే వారంతా మూకుమ్మడిగా అబ్రార్‌పైన, సొహైల్‌పైన కూడా దాడికి పాల్పడ్డారు. దీంతో అబ్రార్ హుస్సేన్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమపై దాడి చేసి తమ వద్ద ఉన్న రూ. 45 వేల నగదును దోచుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.