హైవే‌పై వేల సంఖ్యలో కీటకాలు.. వాహనదారుల్లో టెన్షన్

దిశ, మానకొండూరు : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లోని కాకతీయ కెనాల్ వంతెనపైకి వేలాదిగా వచ్చి చేరిన కీటకాలు గత రెండు రోజులుగా భీభత్సం సృష్టించాయి. దీంతో రాజీవ్ రహాదారిపై వెళ్లే వాహనదారులను కీటకాలు ఒక్కసారిగా ముసురుకోవటంతో వారు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి స్పందించారు. సీపీ ఆదేశాల మేరకు.. కాకతీయ కెనాల్ బ్రిడ్జిపైన వస్తున్న పురుగులు ఏ జాతికి చెందినవి.. అవి రావడానికి గల కారణాలను […]

Update: 2021-04-04 01:39 GMT

దిశ, మానకొండూరు : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లోని కాకతీయ కెనాల్ వంతెనపైకి వేలాదిగా వచ్చి చేరిన కీటకాలు గత రెండు రోజులుగా భీభత్సం సృష్టించాయి. దీంతో రాజీవ్ రహాదారిపై వెళ్లే వాహనదారులను కీటకాలు ఒక్కసారిగా ముసురుకోవటంతో వారు ఇబ్బందులు పడ్డారు.

ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి స్పందించారు. సీపీ ఆదేశాల మేరకు.. కాకతీయ కెనాల్ బ్రిడ్జిపైన వస్తున్న పురుగులు ఏ జాతికి చెందినవి.. అవి రావడానికి గల కారణాలను జేడీ అగ్రికల్చర్ శ్రీధర్ ఆధ్వర్యంలో తిమ్మాపూర్ అగ్రికల్చర్ ఆఫీసర్ సురేందర్.. కీటకాల నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. ఒకటి, రెండు రోజుల్లో వాహనదారులకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పారు. 

Tags:    

Similar News