వెయ్యేళ్లగా చెక్కు చెదరని కోడిగుడ్డు.. షాక్‌లో పరిశోధకులు
దిశ, వెబ్‌డెస్క్ : కోడి గుడ్డు ఐదు లేదా ఆరో రోజులు పాడైపోకుండా ఉంటుంది. కానీ ఓ దేశంలో ఏకంగా 1000 సంత్సరాలు ఓ కోడి గుడ్డు పాడైపోకుండా ఉంది. 1000 సంవత్సరాలు కోడి గుడ్డు పాడైపోకుండా ఉండటం ఏంటీ అనుకుంటున్నారా ?.. ఇజ్రాయెల్ దేశంలో పురావస్తు పరిశోధకులు తవ్వకాలు చేపట్టారు. ఆ తవ్వకాలలో ఏకంగా 1000 ఏళ్లనాటి కోడిగుడ్డు బయటపడింది. అది ఇప్పటికీ ఏ మాత్రం పాడైపోకుండా, పగిలిపోకుండా అలాగే ఉండటంతో అధికారులు సైతం ఆశ్యర్యానికి […]
దిశ, వెబ్‌డెస్క్ : కోడి గుడ్డు ఐదు లేదా ఆరో రోజులు పాడైపోకుండా ఉంటుంది. కానీ ఓ దేశంలో ఏకంగా 1000 సంత్సరాలు ఓ కోడి గుడ్డు పాడైపోకుండా ఉంది. 1000 సంవత్సరాలు కోడి గుడ్డు పాడైపోకుండా ఉండటం ఏంటీ అనుకుంటున్నారా ?.. ఇజ్రాయెల్ దేశంలో పురావస్తు పరిశోధకులు తవ్వకాలు చేపట్టారు. ఆ తవ్వకాలలో ఏకంగా 1000 ఏళ్లనాటి కోడిగుడ్డు బయటపడింది.
అది ఇప్పటికీ ఏ మాత్రం పాడైపోకుండా, పగిలిపోకుండా అలాగే ఉండటంతో అధికారులు సైతం ఆశ్యర్యానికి గురయ్యారు. ఈ గుడ్డుతో పాటు కొన్ని ఎముకలు, బొమ్మలు కూడా కందకంలో లభించాయని పరిశోధకులు తెలిపారు. ఇన్ని సంత్సరాలైనా ఈ గుడ్డు చెక్కుచెదరకుండా ఉండటం ఆశ్చర్యాన్ని కలిస్తుందని దీనిపై మరింత లోతుగా పరిశోధనలు చేస్తామని, డీఎన్ఏ విశ్లేషణ కోసం భద్రపరుస్తామని పరిశోధకులు తెలిపారు. ఈ దశాబ్దాల నాటి కోడి గుడ్డును యావ్నే పట్టణ శివార్లలోని పూరాతన కందకంలో ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ గుర్తించింది.