జూపార్కులో ఉమ్మి వేస్తే రూ 1000 ఫైన్
దిశ ప్రతినిధి , హైదరాబాద్: లాక్ డౌన్ కారణంగా మూసి ఉంచిన నెహ్రూ జూలాజికల్ పార్క్‌ను ఈ నెల 6 నుంచి ఓపెన్ చేయనున్నట్టు జూ క్యూరేటర్ క్షితిజ తెలిపారు. కరోనా లాక్ డౌన్‌తో మార్చ్ 15న జూ పార్క్ మూసి వేసినట్టు ఆమె తెలిపారు. జంతు సందర్శన శాలకు వచ్చే సందర్శకులు విధిగా మాస్క్ ధరించాలని , లేని పక్షంలో లోనికి అనుమతించబోమన్నారు. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ 6 అడుగుల దూరం పాటించాలని చెప్పారు. […]
దిశ ప్రతినిధి , హైదరాబాద్:
లాక్ డౌన్ కారణంగా మూసి ఉంచిన నెహ్రూ జూలాజికల్ పార్క్‌ను ఈ నెల 6 నుంచి ఓపెన్ చేయనున్నట్టు జూ క్యూరేటర్ క్షితిజ తెలిపారు. కరోనా లాక్ డౌన్‌తో మార్చ్ 15న జూ పార్క్ మూసి వేసినట్టు ఆమె తెలిపారు. జంతు సందర్శన శాలకు వచ్చే సందర్శకులు విధిగా మాస్క్ ధరించాలని , లేని పక్షంలో లోనికి అనుమతించబోమన్నారు. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ 6 అడుగుల దూరం పాటించాలని చెప్పారు. వృద్ధులు, 10 ఏండ్ల లోపు పిల్లలకు ప్రవేశం లేదన్నారు . అంతేకాకుండా జూపార్కు లో ఎవరైనా ఉమ్మి వేస్తే రూ.1000 జరిమానా వేస్తామని హెచ్చరించారు.