దేవాలయ భూమి కబ్జా?
దిశ, ఆలేరు: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం దాతర్ పల్లి గ్రామంలో దేవాలయ భూమి కబ్జాకు కొందరూ ప్రయత్నిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. సర్వే నెంబరు 302, 303 ప్రకారం 2.5 ఎకరాల బీరప్ప-మల్లికార్జున దేవాలయానికి చెందిన భూమిని కొందరు వ్యక్తులు దొంగ పత్రాలను సృష్టించి అక్రమించుకోవాలని కుట్రపన్నారు. సుమారు 150 సంవత్సరాల నుంచి ఈ భూమి పోరంబోకు భూమిగా రెవెన్యూ రికార్డుల్లో ఉంది. ఈ భూమి, దాతర్‌పల్లి గ్రామంలో ఉన్న గొల్ల కురుమలకు వారసత్వంగా వస్తున్నట్టు […]
దిశ, ఆలేరు: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం దాతర్ పల్లి గ్రామంలో దేవాలయ భూమి కబ్జాకు కొందరూ ప్రయత్నిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. సర్వే నెంబరు 302, 303 ప్రకారం 2.5 ఎకరాల బీరప్ప-మల్లికార్జున దేవాలయానికి చెందిన భూమిని కొందరు వ్యక్తులు దొంగ పత్రాలను సృష్టించి అక్రమించుకోవాలని కుట్రపన్నారు. సుమారు 150 సంవత్సరాల నుంచి ఈ భూమి పోరంబోకు భూమిగా రెవెన్యూ రికార్డుల్లో ఉంది. ఈ భూమి, దాతర్‌పల్లి గ్రామంలో ఉన్న గొల్ల కురుమలకు వారసత్వంగా వస్తున్నట్టు గ్రామస్తులు వివరిస్తున్నారు. ఈ సందర్భంగా హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కట్టె గొమ్ముల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. దేవాలయ భూమిని కబ్జా చేయాలని చూస్తున్నవారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.