సీనియర్ సిటిజన్స్ కోసం రేడియో స్టేషన్
దిశ, ఫీచర్స్ : తమిళనాడులోని చెన్నైలో సీనియర్ సిటిజన్ల కోసం మొట్టమొదటి ఆన్‌లైన్ కమ్యూనిటీ రేడియో స్టేషన్ ఏర్పాటు కాబోతుంది. ఆగస్టు 21న ‘వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే’ సందర్భంగా లాంచ్ చేయనున్నారు. వయోవృద్ధులచే నడపబడే ఈ స్టేషన్‌ను టీటీకే రోడ్ సమీపంలో ‘అన్నయ్ అన్భలయ ట్రస్ట్’ ప్రారంభించబోతోంది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆమోదించిన 10 కమ్యూనిటీ రేడియో స్టేషన్లలో ఇది కూడా ఒకటి కాగా న్యూఢిల్లీకి చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ […]
దిశ, ఫీచర్స్ : తమిళనాడులోని చెన్నైలో సీనియర్ సిటిజన్ల కోసం మొట్టమొదటి ఆన్‌లైన్ కమ్యూనిటీ రేడియో స్టేషన్ ఏర్పాటు కాబోతుంది. ఆగస్టు 21న ‘వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే’ సందర్భంగా లాంచ్ చేయనున్నారు. వయోవృద్ధులచే నడపబడే ఈ స్టేషన్‌ను టీటీకే రోడ్ సమీపంలో ‘అన్నయ్ అన్భలయ ట్రస్ట్’ ప్రారంభించబోతోంది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆమోదించిన 10 కమ్యూనిటీ రేడియో స్టేషన్లలో ఇది కూడా ఒకటి కాగా న్యూఢిల్లీకి చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ ద్వారా ఇది అమలు చేయబడుతుంది.
సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆరోగ్య సంబంధిత సమస్యల గురించి అవగాహన కల్పించడం లక్ష్యంగా పాడ్‌కాస్ట్‌ల రూపంలో వారానికి కనీసం నాలుగు కార్యక్రమాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. స్టేషన్ కార్యకలాపాల నిర్వహణకు సీనియర్ సిటిజన్స్‌కు ల్యాప్‌టాప్‌లు, మైక్రోఫోన్‌లు అందించబడంతో పాటు ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌లో శిక్షణ ఇస్తారు. కాగా చెన్నైలోని విజ్ఞాన్ ప్రసార్‌లో కమిటీ సభ్యుడైన ఎన్‌సీ రాజమణి మాట్లాడుతూ.. మహానగరంలోని చాలా వృద్ధాశ్రమాలను విశ్లేషించానని, వారిలో చాలావరకు టాలెంటెడ్ పీపుల్ ఉన్నారని చెప్పారు. టీటీకే హైవే వద్ద గల 50 మంది అనాథ మహిళల్లో చాలా మంది బాగా పాడగలరని, వీరిలో ఇంకొంతమందికి కరెంట్ అఫైర్స్‌పై నాలెడ్జ్ ఉందన్నారు. వీరికోసం చెన్నై అవుట్ కట్స్‌లోని అత్తిపట్టులో మరో రేడియో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
కమ్యూనిటీ రేడియో స్టేషన్..
2004లో అన్నా కాలేజీ వద్ద భారతదేశపు మొట్టమొదటి కమ్యూనిటీ రేడియో స్టేషన్ ఏర్పాటుకు కృషి చేసిన B శ్రీధర్ రామమూర్తి మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది ఆరు ప్రాంతాల నుంచి సీనియర్ రెసిడెంట్స్ ద్వారా 624 పాడ్‌కాస్ట్‌లు ప్రసారం చేసేందుకు మాకు రూ. 24 లక్షలు కేటాయించబడ్డాయి. ఈ కార్యక్రమాలు దాదాపు సీనియర్ రెసిడెంట్స్ కోసమే రూపొందించాం. ఇందుకోసం కారైకుడిలోని అలగప్ప కాలేజ్, కోయంబత్తూర్‌లోని తపోవన్, పుదుచ్చేరిలో MV EC, భీవండిలోని ఆషియానా సీనియర్ సొసైటీ, బెంగళూరులోని రేడియో సారథి జలక్‌తో పాటు న్యూఢిల్లీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్‌లోని రెండు రేడియో స్టేషన్లను ఉపయోగిస్తాం’ అని వెల్లడించారు. అంతేకాదు ప్రభుత్వం చాలా తక్కువ ఖర్చుతోనే ప్రతీ వృద్ధాశ్రమంలో ఒక స్టేషన్‌ను ఏర్పాటు చేయవచ్చని ఆయన తెలిపారు.