కత్తి, సుత్తితో కటింగ్.. క్యూ కడుతున్న కస్టమర్లు.. ఎక్కడో తెలుసా..?
దిశ, వెబ్‌డెస్క్: తలపై బాగా పెరిగిన జుట్టును కత్తిరించుకోవడానికి హెయిర్ సెలూన్ షాపులోకి వెళ్లి.. కటింగ్ అయ్యాక చివరలో చిన్న సీజర్‌తో షేవింగ్ చేస్తేనే అల్లాడిపోతాం. ఆ సీజర్ గాటు పడకుండా ఉండేందుకు సదరు బార్బర్ కూడా చాలా జాగ్రత్తగా జుట్టును గానీ, గడ్డాన్ని గానీ షేవ్ చేస్తుంటాడు. చిన్న సీజర్‌కే అంత భయపడితే.. ఇక్కడ ఒక బార్బర్ సీజర్‌తో కాదు, ఏకంగా పదునైన పెద్ద కత్తి, గోడలకు మేకులు దించే సుత్తితో కటింగ్ చేస్తున్నాడు. అదేంటి..? […]
దిశ, వెబ్‌డెస్క్: తలపై బాగా పెరిగిన జుట్టును కత్తిరించుకోవడానికి హెయిర్ సెలూన్ షాపులోకి వెళ్లి.. కటింగ్ అయ్యాక చివరలో చిన్న సీజర్‌తో షేవింగ్ చేస్తేనే అల్లాడిపోతాం. ఆ సీజర్ గాటు పడకుండా ఉండేందుకు సదరు బార్బర్ కూడా చాలా జాగ్రత్తగా జుట్టును గానీ, గడ్డాన్ని గానీ షేవ్ చేస్తుంటాడు. చిన్న సీజర్‌కే అంత భయపడితే.. ఇక్కడ ఒక బార్బర్ సీజర్‌తో కాదు, ఏకంగా పదునైన పెద్ద కత్తి, గోడలకు మేకులు దించే సుత్తితో కటింగ్ చేస్తున్నాడు. అదేంటి..? కత్తి, సుత్తితో కటింగ్ ఎలా చేస్తారు..? జరగరానిది ఏదైనా జరిగితే ఎవరిది రెస్పాన్సిబులిటీ.. అని భయపడుతున్నారా..? ఏమి జరగదు. అదే అతడి స్పెషాలిటి.
ఈ కత్తి, సుత్తి కటింగ్ విషయానికొస్తే.. పాకిస్థాన్‌కు చెందిన అలీ అబ్బాస్‌కు లాహోర్‌లో ఒక హెయిర్ సెలూన్ షాపు ఉంది. మగవారికి కటింగ్, షేవింగ్‌తో పాటు ఆడవారికి హెయిర్ కట్, బ్యూటీ పార్లర్ వంటి సేవలు కూడా అక్కడ లభ్యమవుతాయి. అయితే క్రాఫ్ చేయించుకోవడానికి అలీ దగ్గరకు వచ్చిన వారికి అందరిలాగే కటింగ్ చేయడం రొటీన్‌గా అనిపించింది. అందుకే కాస్త వెరైటీగా ఆలోచించాడు. అందరు బార్బర్లలా కత్తెర, దువ్వెన, సీజర్‌తో కాకుండా మటన్ కొట్టే పెద్ద కత్తి, సుత్తితో కటింగ్ చేయడం ప్రారంభించాడు. ముందు ఇది చూసిన కస్టమర్లు.. ‘ఈ కటింగ్ మాకొద్దు బాబోయ్…‘ అంటూ పరుగులు తీశారు. కానీ మెల్లమెల్లగా వాళ్లకు ఇది విచిత్రంగా అనిపించి కత్తి, సుత్తి కటింగే కావాలని అలీ షాపులోకి క్యూ కట్టారు.
ఇలా కత్తితో కటింగ్ చేయడంలో అలీకి రాత్రికి రాత్రే నైపుణ్యం సాధించలేదు. సుమారు ఏడాది పాటు శ్రమించి అందులో ప్రావీణ్యం సాధించాడు. ఈ కటింగ్ ఒక్కటే కాదండోయ్.. మనోడి దగ్గర ఇంకో స్పెషాలిటి కూడా ఉంది. ఎవరైనా తమకు సెపరేట్ హెయిర్ స్టైల్ కావాలనుకుంటే వారికి కొత్త ట్రీట్మెంట్ ఉంది. వెంట్రుకల మీద ఒక ద్రావణాన్ని పోసి దానికి నిప్పంటిస్తాడు. దానిద్వారా వారికి కావాలనుకున్న క్రాఫ్‌ను సెట్ చేయడం అలీ స్పెషాలిటీ. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మరి ఆ కత్తి, సుత్తి కటింగ్ ఎలా ఉంటుందో మీరూ ఓ లుక్కేయండి.