ఎలక్ట్రిసిటీ అవసరం లేని భూగర్భ రిఫ్రిజిరేటర్
దిశ, ఫీచర్స్ : చాలామంది ‘రిఫ్రిజిరేటర్’ కొనేముందు ఏ స్టార్ రేటింగ్ ఫ్రిడ్జ్ తీసుకుంటే ఎన్ని యూనిట్ల కరెంట్ ఆదా అవుతుందా అనే ఆలోచిస్తారు. అయితే ఫుడ్ నిల్వ చేసుకునేందుకు దీని వల్ల ఉపయోగమున్నా పర్యావరణానికి మాత్రం కొంత నష్టమే. మరి ప్రకృతికి ఎలాంటి నష్టం కలిగించని, కరెంట్ కూడా ఉపయోగించుకోలేని ఎకో ఫ్రెండ్లీ రిఫ్రిజిరేటర్ ఉంటే ఎంత బాగుంటుందో కదా! మరి అలాంటిదే ఈ ‘గ్రౌండ్ ఫ్రిడ్జ్’ విశేషాలేంటో చూద్దాం. పవర్ అవసరం లేకుండా పదార్థాలను […]
దిశ, ఫీచర్స్ : చాలామంది ‘రిఫ్రిజిరేటర్’ కొనేముందు ఏ స్టార్ రేటింగ్ ఫ్రిడ్జ్ తీసుకుంటే ఎన్ని యూనిట్ల కరెంట్ ఆదా అవుతుందా అనే ఆలోచిస్తారు. అయితే ఫుడ్ నిల్వ చేసుకునేందుకు దీని వల్ల ఉపయోగమున్నా పర్యావరణానికి మాత్రం కొంత నష్టమే. మరి ప్రకృతికి ఎలాంటి నష్టం కలిగించని, కరెంట్ కూడా ఉపయోగించుకోలేని ఎకో ఫ్రెండ్లీ రిఫ్రిజిరేటర్ ఉంటే ఎంత బాగుంటుందో కదా! మరి అలాంటిదే ఈ ‘గ్రౌండ్ ఫ్రిడ్జ్’ విశేషాలేంటో చూద్దాం.
పవర్ అవసరం లేకుండా పదార్థాలను నిల్వచేసే ‘గ్రౌండ్ ఫ్రిడ్జ్’ను ఓ డచ్ కంపెనీ తయారుచేస్తోంది. కానీ ఈ రిఫ్రిజిరేటర్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి 8×8 అడుగుల వెడల్పుతో ఏడు అడుగుల లోతు గుంత తవ్వాలి. ఈ భూగర్భ ఫ్రిజ్‌లో బ్యాటరీతో నడిచే వెంటిలేటర్ కూడా ఉంటుంది. ఇది లోపలి ఉష్ణోగ్రతలను తగ్గించడానికి చల్లని గాలిని పీల్చుకుంటుంది. అంతేకాదు సూర్యరశ్మి, నేల రకం, భూగర్భజల స్థాయి వంటి అంశాలు దీని లోపలి ఉష్ణోగ్రతను ప్రభావితం చేస్తాయి. ఇక డెవలపర్ల ప్రకారం గ్రౌండ్‌ఫ్రిడ్జ్ లోపలి ఉష్ణోగ్రత ఏడాది పొడవునా 50 డిగ్రీల ఫారెన్‌హీట్‌తో ఉంటుంది. ఇక ఫ్రిజ్ లోపలి భాగంలో కాంతిని ప్రతిబింబించేలా తెల్లని కలరు, తలుపులకు వెలుపల ఆకుపచ్చ రంగులు వేస్తారు. దీన్ని పూర్తిగా తోటలో కలిసిపోయే విధంగా డిజైన్ చేస్తారు. అలాగే 3వేల లీటర్ల సామర్థ్యం కలిగి ఉండే ఈ ఫ్రిడ్జ్‌లో మొత్తం 20 కుటుంబాలకు సరిపడే పదార్థాలను దాచుకోవచ్చు. దీని ధర భారతదేశ కరెన్సీలో రూ.15 లక్షలు కాగా.. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.