మహిళను వదిలి పరుగందుకున్న దొంగ

      చైనాలో మహిళ సమయస్పూర్తి ఆమెను దొంగ బారినుంచి రక్షించింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే.. చైనాలోని హుబై నగరంలో ఓ మహిళ నివాసముంటోంది. ఆమె ఇంటి కిటికీ అద్దాలు బద్దలు కొట్టి దొంగ ప్రవేశించాడు. నెమ్మదిగా మహిళను చేరుకుని ఆమె గొంతుపై కత్తి పెట్టి ఇంట్లో ఉన్న విలువైన ఆభరణాలు, నగదు తీసుకు రమ్మని బెదిరించాడు. ఈ ముప్పునుంచి బయటపడాలనుకున్న మహిళ.. నెమ్మదిగా దగ్గడం ఆరంభించింది. దగ్గు పెరుగుతుండడంతో అనుమానం వచ్చిన దొంగ […]

Update: 2020-02-04 20:16 GMT

చైనాలో మహిళ సమయస్పూర్తి ఆమెను దొంగ బారినుంచి రక్షించింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే.. చైనాలోని హుబై నగరంలో ఓ మహిళ నివాసముంటోంది. ఆమె ఇంటి కిటికీ అద్దాలు బద్దలు కొట్టి దొంగ ప్రవేశించాడు. నెమ్మదిగా మహిళను చేరుకుని ఆమె గొంతుపై కత్తి పెట్టి ఇంట్లో ఉన్న విలువైన ఆభరణాలు, నగదు తీసుకు రమ్మని బెదిరించాడు. ఈ ముప్పునుంచి బయటపడాలనుకున్న మహిళ.. నెమ్మదిగా దగ్గడం ఆరంభించింది. దగ్గు పెరుగుతుండడంతో అనుమానం వచ్చిన దొంగ ఏమైంది? అని అడిగాడు. వెంటనే నూతన సంవత్సర వేడుకలకు వూహాన్ వెళ్లి వచ్చానని, వచ్చినప్పటి నుంచి ఒకటే దగ్గు, తలనొప్పి, ముక్కు నుంచి నీరు కారుతున్నాయని చెప్పింది. ఒకవేళ కరోనా సోకిందేమోనని అనుమానంగా ఉందంది. అంతే.. అప్పటి వరకు మహిళను గట్టిగా పట్టుకున్న దొంగ ఒక్కసారి ఆమెను వదిలేసి అక్కడ్నించి పరారయ్యాడు. ఈ క్రమంలో దొరికింది కదా అని ఆమె ఐఫోన్ పట్టుకుని పోయాడు. దీంతో ఆమె పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ టీవీ పుటేజ్, ఫోన్ లొకేషన్ ఆధారంగా అతనిని అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News