దొంగలను కాల్చేసిన పోలీసులు.. ఎందుకంటే ?
గుహవటి: బ్యాంక్ దోపిడికి ప్రయత్నించిన ముగ్గురు దొంగలను అస్సాం పోలీసులు కాల్చి చంపారు. ఆదివారం కొక్రాఝర్ జిల్లాలోని బోట్గాన్ గ్రామంలో ఉన్న అలహబాద్ బాంకులోకి కొంతమంది దొంగలు ప్రవేశించారని పోలీసులకు సమాచారం అందింది. అక్కడికి హూటాహూటిన చేరుకున్న పోలీసులపై, దొంగలు కాల్పులు జరపారని తెలుస్తోంది. పోలీసులు సైతం ఎదురుకాల్పులకు దిగటంతో ముగ్గురు దొంగలు చనిపోయారని వెల్లడించారు. మరో ఇద్దరు లేదా ముగ్గురు దొంగలు పారిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ దొంగలను పోలీసులు సమీపంలోని దవాఖానాకు […]
గుహవటి: బ్యాంక్ దోపిడికి ప్రయత్నించిన ముగ్గురు దొంగలను అస్సాం పోలీసులు కాల్చి చంపారు. ఆదివారం కొక్రాఝర్ జిల్లాలోని బోట్గాన్ గ్రామంలో ఉన్న అలహబాద్ బాంకులోకి కొంతమంది దొంగలు ప్రవేశించారని పోలీసులకు సమాచారం అందింది. అక్కడికి హూటాహూటిన చేరుకున్న పోలీసులపై, దొంగలు కాల్పులు జరపారని తెలుస్తోంది. పోలీసులు సైతం ఎదురుకాల్పులకు దిగటంతో ముగ్గురు దొంగలు చనిపోయారని వెల్లడించారు. మరో ఇద్దరు లేదా ముగ్గురు దొంగలు పారిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ దొంగలను పోలీసులు సమీపంలోని దవాఖానాకు తరలించారని తెలిపారు. పారిపోయిన దొంగలను వెతికిపట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని అస్సాం డీజీపీ భాస్కర్‌జ్యోతి మహంతా వెల్లడించారు.
కాగా రాత్రి 2.30 నిమిషాలకు ఈ కాల్పులు చోటు చేసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలంలో 25 లీటర్ల ఆక్సిజన్, 14.5 లీటర్ల గ్యాస్ సిలిండర్, ఒక ఇనుప రాడ్, 7.65 ఎంఎం హ్యండ్ గన్స్, ఎనిమిది బుల్లెట్స్, ఆరు ఖాళీ మ్యాగజైన్స్ దొరికినట్లు తెలిపారు. చనిపోయిన వారిని సిరాజ్ దులా షేక్, మౌనార్ హూస్సేన్, అమినుల్ హక్ గా గుర్తించామని ప్రకటించారు. గడిచిన మూడు నెలల్లో ఇలా దొంగతనాలు చేయటం ఇది రెండోసారని పోలీసులు వెల్లడించారు. దొంగలను కాల్చిచంపటం పై అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ పోలీసులను ప్రశంసించారు. కొక్రాఝర్‌లోని దొంగల ముఠాను నిర్మూలించి పెద్ద బాంకు దొంగతనాన్ని సమర్దవంతంగా అడ్డుకున్నారన్నారు.