కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. భవిష్యత్తులో యుద్ధాలు జరుగుతాయి
దిశ, శేరిలింగంపల్లి: రోజురోజుకు సైబర్ క్రైం పెరిగిపోతున్న నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, అందుకు ప్రభుత్వం కూడా తనవంతు సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్. శుక్రవారం కోటలిజెంట్ నూతన సైబర్ వారియర్ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ (సీఓఈ) ను ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నేరాలు పెరిగిపోయాయని, భవిష్యత్తులో […]
దిశ, శేరిలింగంపల్లి: రోజురోజుకు సైబర్ క్రైం పెరిగిపోతున్న నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, అందుకు ప్రభుత్వం కూడా తనవంతు సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్. శుక్రవారం కోటలిజెంట్ నూతన సైబర్ వారియర్ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ (సీఓఈ) ను ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నేరాలు పెరిగిపోయాయని, భవిష్యత్తులో రక్తం చుక్కలేని యుద్ధాలు జరుగుతాయని, అవన్నీ సైబర్ యుద్ధాలేనని అన్నారు. డిజిటలైజేషన్ లో బాగా వృద్ధి చెందింది రోజురోజుకు సైబర్ క్రైం ఎక్కువ అవుతోందని, పోలీసులకంటే నేరగాళ్లు ఎక్కువ తెలివితేటలు ప్రదర్శిస్తూ మోసలకు పాల్పడుతున్నారని అన్నారు. చివరకు ప్రధాని సోషల్ అకౌంట్ కూడా హ్యాకింగ్ జరిగిందని, సైబర్ క్రైమ్ అనేది పెద్ద సమస్యగా మారిందని, సైబర్ క్రైమ్ నిరోధానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని, అందుకు కోటలిజెంట్ సంస్థ శ్రీకిరన్ పాటిబండ ముందుకు రావడం అభినందనీయమన్నారు. సైబర్ క్రైమ్ నిరోధానికి సైబర్ వారియర్స్ కావాలని, ఆ దిశగా కొత్త సెక్యూరిటీని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో 50 శాతం మంది యువత 27 సంవత్సరాల లోపు వారేనని, స్కిల్ అండ్ నాలెడ్జ్ అభివృద్ధి కోసం పాటుపడాలని సూచించారు. ప్రభుత్వాలు కేవలం ఒకటి రెండు శాతం మాత్రమే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని, ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు తగిన ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. ఎన్నో కార్యక్రమాల ద్వారా యువత నైపుణ్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని, హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఎదిగిందని, నైపుణ్యం ఉన్నవారికి అన్ని రంగాల్లోనూ ప్రథమ ప్రాధాన్యత ఉంటుందని అన్నారు.