ఏపీలో 18 ఏళ్లు నిండిన వారికి ఇప్పట్లో నో వ్యాక్సిన్

దిశ, వెబ్‌డెస్క్: 18 ఏళ్లు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చే విషయంపై ఏపీ ప్రభుత్వం చేతులెత్తేసింది. ఇప్పట్లో వారికి వ్యాక్సిన్ ఇవ్వలేమని తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రకటించడం విమర్శలకు దారి తీస్తుంది. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేయనున్నట్టు ఇటీవల కేంద్రం ప్రకటించింది. అందులో భాగంగా మే 1 నుంచి ఏపీలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వనున్నట్లు ఇటీవల సీఎం వైఎస్ జగన్ స్వయంగా ప్రకటించారు. […]

Update: 2021-04-27 06:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: 18 ఏళ్లు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చే విషయంపై ఏపీ ప్రభుత్వం చేతులెత్తేసింది. ఇప్పట్లో వారికి వ్యాక్సిన్ ఇవ్వలేమని తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రకటించడం విమర్శలకు దారి తీస్తుంది. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేయనున్నట్టు ఇటీవల కేంద్రం ప్రకటించింది. అందులో భాగంగా మే 1 నుంచి ఏపీలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వనున్నట్లు ఇటీవల సీఎం వైఎస్ జగన్ స్వయంగా ప్రకటించారు. ఏప్రిల్ 28 నుంచి రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని సూచించారు. కానీ ఏమైందో ఏమో కానీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం వెనకడుగు వేసింది.

18 ఏళ్లు పైబడిన వారందరికీ ఇప్పట్లో వ్యాక్సిన్ ఇవ్వలేమని, జూన్‌ నుంచి ఇచ్చే అవకాశాలున్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. టీకా పంపిణీ కోసం సంబంధిత కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నామని, కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఒప్పందాలు జరగలేదన్నారు. దీంతో 18 ఏళ్లు పైబడిన వారికి ఇప్పట్లో టీకా పంపిణీ చేసే అవకాశం లేదన్నారు.

Tags:    

Similar News