పర్యాటకులకు గుడ్‌న్యూస్.. తాటిపూడి రిజర్వాయర్‌లో బోటింగ్‌కు అనుమతి
పర్యాటకులకు రాష్ర్ట ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
దిశ ప్రతినిధి, విజయనగరం: పర్యాటకులకు రాష్ర్ట ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విజయనగరం జిల్లా తాటిపూడి రిజర్వాయర్‌లో బోటింగ్‌కు అనుమతి ఇచ్చింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కృషి మేరకు తాటిపూడి రిజర్వాయర్‌లో బోటింగ్ కోసం జలవనరుల శాఖ అనుమతులు జారీ చేసింది. విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలో ఉన్న తాటిపూడి రిజర్వాయర్‌లో బోటింగ్ కోసం పర్యాటకులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు.
ఫలించిన మంత్రి కొండపల్లి కృషి
కూటమి ప్రభుత్వంలో స్థానిక శాసనసభ్యుడు కొండపల్లి శ్రీనివాస్ రాష్ట్ర మంత్రి కావడంతో ఆ ప్రాంత ప్రజలు బోటింగ్ కార్యక్రమాలు పునరుద్ధరించాలని మంత్రిని కోరారు. ఫలితంగా జిల్లా అధికార యంత్రాంగం, పర్యాటక, జలవనరుల శాఖ అధికారులతో పలుమార్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సంప్రదించి బోటింగ్ కార్యక్రమాలకు అనుమతులు సాధించారు. ఇప్పటికే జనవనరుల శాఖ, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బోటింగ్ కార్యక్రమాల నిర్వహణ కోసం అనుమతులు ఇచ్చింది.
వారంలో పనులు ప్రారంభం
బోటింగ్ కార్యకలాపాల కోసం అవసరమైన మౌలిక వసతుల కల్పనా కార్యక్రమాలు మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం అవసరమైన జెట్టీ నిర్మాణ పనులను ప్రారంభించి నెల రోజులలోపు పూర్తి చేయనున్నారు. జెట్టి ఏర్పాటు పూర్తయిన వెంటనే తాటిపూడి రిజర్వాయర్‌లో బోటింగ్ కార్యక్రమాలు ప్రారంభమవ్వనున్నాయి. దీంతో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పర్యాటకుల కోరిక త్వరలో తీరనుంది.