తెలంగాణలో నొక్కి.. ఆంధ్రాలో చిక్కిన కేటుగాళ్లు

దిశ, ఏపీబ్యూరో : తెలంగాణలో చోరీకి పాల్పడిన కేటుగాళ్లు ఆంధ్రా బోర్డర్‌లో చిక్కారు. కృష్ణా జిల్లా నందిగామ మండలం జొన్నలగడ్డ చెక్‌పోస్టు వద్ద తనిఖీల్లో భాగంగా నిందితుల నుంచి పోలీసులు భారీగా నగదును పట్టుకున్నారు. అంతకుముందు ఫిబ్రవరి 26న వైరాలోని ద్వారకానగర్‌‌లో ఉన్న ఓ ఇంట్లో వీరు చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆదివారం చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఈ కేటుగాళ్లు చిక్కారు. నిందితుల నుంచి రూ.35,61,650 నగదుతో పాటు బంగారం, వెండిని స్వాధీనం చేసుకున్నారు. […]

Update: 2021-02-28 10:14 GMT

దిశ, ఏపీబ్యూరో : తెలంగాణలో చోరీకి పాల్పడిన కేటుగాళ్లు ఆంధ్రా బోర్డర్‌లో చిక్కారు. కృష్ణా జిల్లా నందిగామ మండలం జొన్నలగడ్డ చెక్‌పోస్టు వద్ద తనిఖీల్లో భాగంగా నిందితుల నుంచి పోలీసులు భారీగా నగదును పట్టుకున్నారు. అంతకుముందు ఫిబ్రవరి 26న వైరాలోని ద్వారకానగర్‌‌లో ఉన్న ఓ ఇంట్లో వీరు చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది.

ఆదివారం చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఈ కేటుగాళ్లు చిక్కారు. నిందితుల నుంచి రూ.35,61,650 నగదుతో పాటు బంగారం, వెండిని స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. 40 లక్షల 79వేలు ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. పట్టుబడిన వారిలో దినేష్ సింగ్, ఇన్సాఫ్ మహ్మద్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News