నవరాత్రి ఉత్సవాల్లో భక్తులకు షాక్.. గుడిలోని హుండీ ఎత్తుకెళ్లిన దొంగ
దిశ, జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని పురాణిపేట పోచమ్మ దేవాలయంలో తెల్లవారుజూమున 3 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించి హుండీ ఎత్తుకెళ్లాడు. ఆలయ ప్రధాన ద్వారం తాళాలను గడ్డపారతో తొలగించి గుడిలోనికి ప్రవేశించిన దొంగ ప్రధాన హుండీలోని నగదు, నగలు ఎత్తుకెళ్లాడు. ఇదంతా కూడా ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఇటీవల ఆలయ వార్షికోత్సవ వేడుకలు, నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు హుండీలో వేసిన వెండి, నగదు, బంగారు వస్తువులు […]
దిశ, జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని పురాణిపేట పోచమ్మ దేవాలయంలో తెల్లవారుజూమున 3 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించి హుండీ ఎత్తుకెళ్లాడు. ఆలయ ప్రధాన ద్వారం తాళాలను గడ్డపారతో తొలగించి గుడిలోనికి ప్రవేశించిన దొంగ ప్రధాన హుండీలోని నగదు, నగలు ఎత్తుకెళ్లాడు. ఇదంతా కూడా ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఇటీవల ఆలయ వార్షికోత్సవ వేడుకలు, నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు హుండీలో వేసిన వెండి, నగదు, బంగారు వస్తువులు చోరీకి గురయ్యాయని తెలుస్తోంది. ఆలయ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు జగిత్యాల పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.