థియేటర్లు తెరిచారు.. జనాలు రాలేదు!

దిశ ప్రతినిధి, హైదరాబాద్: కరోనా వైరస్ సినిమా రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. వైరస్​దెబ్బకు మూతబడిన థియేటర్లు తొమ్మిది నెలల అనంతరం తెరుచుకుంటున్నాయి. ప్రభుత్వ నిబంధలకనుగుణంగా 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుపుకోవచ్చు. కానీ, ప్రేక్షకుల్లో ఇంకా కరోనా భయం తొలగలేదు. 25శాతం టికెట్లు సైతం అమ్ముడుపోవడంలేదని నిర్వాహకులు వాపోతున్నారు. కరోనా ప్రభావం సినిమా హాళ్లపై పడినంతగా ఇతర ఏ రంగాలపై పడలేదు. థియేటర్లు సుమారు 9 నెలల అనంతరం క్రమంగా తెరుచుకుంటున్నాయి. బిగ్ స్క్రీన్ పై […]

Update: 2020-12-10 21:38 GMT

దిశ ప్రతినిధి, హైదరాబాద్: కరోనా వైరస్ సినిమా రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. వైరస్​దెబ్బకు మూతబడిన థియేటర్లు తొమ్మిది నెలల అనంతరం తెరుచుకుంటున్నాయి. ప్రభుత్వ నిబంధలకనుగుణంగా 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుపుకోవచ్చు. కానీ, ప్రేక్షకుల్లో ఇంకా కరోనా భయం తొలగలేదు. 25శాతం టికెట్లు సైతం అమ్ముడుపోవడంలేదని నిర్వాహకులు వాపోతున్నారు.

కరోనా ప్రభావం సినిమా హాళ్లపై పడినంతగా ఇతర ఏ రంగాలపై పడలేదు. థియేటర్లు సుమారు 9 నెలల అనంతరం క్రమంగా తెరుచుకుంటున్నాయి. బిగ్ స్క్రీన్ పై సినిమా చూసేందుకు తహతహలాడుతున్న ప్రేక్షకులకు ఇది ఆనందం కలిగించే విషయమే. సినిమా హాళ్లలో 50 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే ఉండేలా ప్రభుత్వం నిబంధన విధించింది. దీంతో సీటు విడిచి సీటులో కూర్చునేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రేక్షకులు మూత్రశాలల్లో కూడా సామాజిక దూరం పాటించేలా థియేటర్ల యాజమాన్యం ఏర్పాట్లు చేస్తున్నారు.

స్పందన కరువు..

క‌రోనా నేప‌థ్యంలో థియేట‌ర్లు, మ‌ల్టీప్లెక్స్‌ల య‌జ‌మానులు జాగ్రత్తలు ఎన్ని తీసుకున్నా ప్రేక్షకుల నుంచి మాత్రం స్పంద‌న అంత‌ంత మాత్రమే క‌నిపిస్తుంది. ప్రభుత్వ నిబంధ‌న‌ల కార‌ణంగా 50 శాతం ఆక్యుపెన్సీతో న‌డుస్తున్న థియేట‌ర్లలో ప్రేక్షకులు నిండ‌క‌పోవ‌డం నిర్వాహ‌కుల‌కు త‌ల‌నొప్పిగా మారింది. ప్రస్తుతం కొత్త సినిమాలు ఏమి లేక‌పోవ‌డంతో ఆశించిన మేర‌ ప్రేక్షక్షులు రావ‌డం లేదు. హైదరాబాద్ వంటి నగరాల్లో మల్టీప్లెక్స్‌లు ఓపెన్ చేశారు. ప్రసాద్ ఐమాక్స్ ఓపెన్ చేయడంతో సెలబ్రిటీలు కూడా వెళ్లి ప్రమోషన్ మొదలు పెట్టారు.

పూర్వ వైభవం వచ్చేనా ..?

ఒకప్పుడు శుక్రవారం వచ్చిందంటే సినిమా థియేటర్లలో కొత్త సినిమాలు విడుదలయ్యేవి. థియేటర్ల వద్ద పండుగ వాతావరణం కనిపించేది. అలాంటి పరిస్థితి లేదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విభజనకు ముందు 3600 థియేటర్లు ఉండగా, ఇప్పుడు కేవలం 1600 మాత్రమే ఉన్నాయి. అందులో తెలంగాణ రాష్ట్రంలో 650పైగా థియేటర్లు ఉన్నాయి. వీటిలో ఎన్ని తిరిగి తెరుచుకుంటాయో తెలియదని తెలంగాణ థియేటర్ల యజమానుల సంఘం అధ్యక్షుడు విజేందర్ రెడ్డి పేర్కొన్నారు .

ఇప్పట్లో కష్టమే: భగత్​, ప్రేక్షకుడు

నేను గతంలో విడుదలైన ప్రతీ సినిమాను తప్పక థియేటర్లోనే చూసేవాడిని. కరోనా కారణంగా సినిమా చేసే అవకాశమే లేకుండా పోయింది. ఇప్పుడు సినిమా హాళ్లు తెరచినప్పటికీ సినిమా చూడాలంటే భయమేస్తుంది.

Tags:    

Similar News