సర్పంచ్ ఎదుటే ఆమె భర్తతో యువతి.. అందరూ చూస్తుండగానే..!
దిశ, వెబ్‌డెస్క్ : అధికారం చేతిలో ఉంది కదా అని ఆ సర్పంచ్ భర్త రెచ్చిపోయాడు. కూతురు వయసున్న యువతిని పక్కలోకి రావాలని పోరు పెట్టాడు. వినకపోతే మీ కుటుంబాన్ని అంతం చేస్తానని బెదిరింపులకు దిగాడు. అతగాడి లైంగిక వేదింపులపై తిరగబడిన యువతి కుటుంబ సభ్యులతో కలిసి తగిన బుద్ది చెప్పింది. ఉత్తర ప్రదేశ్ లోని కన్నౌజ్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జలాల్పూర్ అమ్రా గ్రామానికి చెందిన సర్పంచ్ భర్త […]
దిశ, వెబ్‌డెస్క్ : అధికారం చేతిలో ఉంది కదా అని ఆ సర్పంచ్ భర్త రెచ్చిపోయాడు. కూతురు వయసున్న యువతిని పక్కలోకి రావాలని పోరు పెట్టాడు. వినకపోతే మీ కుటుంబాన్ని అంతం చేస్తానని బెదిరింపులకు దిగాడు. అతగాడి లైంగిక వేదింపులపై తిరగబడిన యువతి కుటుంబ సభ్యులతో కలిసి తగిన బుద్ది చెప్పింది. ఉత్తర ప్రదేశ్ లోని కన్నౌజ్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
జలాల్పూర్ అమ్రా గ్రామానికి చెందిన సర్పంచ్ భర్త రామ్ సరన్ అదే గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతిపై కన్నేశాడు. రెండేళ్లుగా ఆమె వెంటపడుతూ లైంగికంగా వేధిస్తున్నాడు. ఒక్కసారైన తనతో గడపాలని నిత్యం టార్చర్ పెడుతున్నాడు. ఒంటరిగా ఉన్న సమయంలో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. మొదట మౌనంగా భరించిన యువతి.. అతడి వేధింపులు ఎక్కువ కావడంతో తల్లి, సోదరుడికి విషయం చెప్పింది. అధికారంలో ఉన్న అతడిని ఎదురించడం కష్టమని ఓ ప్లాన్ వేసుకున్నారు.
పధకం ప్రకారం సర్పంచ్ ఇంటికి యువతితో సహా.. తల్లి, సోదరుడు వెళ్లాడు. లైంగికంగా ఎందుకు వేధిస్తున్నావు అని సర్పంచ్ ముందే పంచాయితీ పెట్టారు. సర్పంచ్ భర్తతో సోదరుడు, తల్లి మాట్లాడుతున్న సమయంలో అదును చూసి యువతి అతడి వెనక నుంచి నాటు తుపాకీతో కాల్పలు జరిపింది. దీంతో సర్పంచ్ భర్త రామ్ సరన్ అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే అక్కడి నుంచి వారంతా ఫరూఖాబాద్‌కు పరారీ అయ్యారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేశారు. హత్యకు లైంగిక వేధింపులే కారణమని నిర్ధారించారు. అనంతరం హత్యకు పాల్పడిన యువతిని, సహకరించిన సోదరుడిని ఫరూఖాబాద్‌లో అరెస్ట్ చేశారు. తన కుటుంబాన్ని చంపుతాడనే భయంతోనే రామ్ సరన్ ను హత్య చేసినట్లు యువతి ఒప్పుకుంది.