హిజ్రాను పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్న యువకుడు.. అర్ధరాత్రి బెడ్ రూంలో ఊహించని ఘటన
దిశ, వెబ్ డెస్క్: హిజ్రాను పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్న యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన ఏపీలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఏపీలోని విజయవాడకు చెందిన ఓ వ్యక్తి తన తల్లిండ్రులతో కలిసి ఉంటున్నాడు. అయితే, అతను ఓ హిజ్రాను ప్రేమించి ఇటీవల పెళ్లి చేసుకున్నాడు. తన అమ్మనాన్నలు ఉండే ఇంటి దగ్గరలోనే తాను కూడా హిజ్రాతో ఉంటున్నాడు. అయితే, ఇలా వారిద్దరూ కాపురం చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. హిజ్రా తెల్లవారుజామున […]
దిశ, వెబ్ డెస్క్: హిజ్రాను పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్న యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన ఏపీలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఏపీలోని విజయవాడకు చెందిన ఓ వ్యక్తి తన తల్లిండ్రులతో కలిసి ఉంటున్నాడు. అయితే, అతను ఓ హిజ్రాను ప్రేమించి ఇటీవల పెళ్లి చేసుకున్నాడు. తన అమ్మనాన్నలు ఉండే ఇంటి దగ్గరలోనే తాను కూడా హిజ్రాతో ఉంటున్నాడు. అయితే, ఇలా వారిద్దరూ కాపురం చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. హిజ్రా తెల్లవారుజామున ఆ యువకుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ అబ్బాయి ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడని తెలిపింది. దీంతో వారు ఇంటికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. అనంతరం వారు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.