ఏటీఎంలో శానిటైజర్ ఎత్తుకెళ్లిన యువకుడు

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక వీడియో తెగ వైరలవుతోంది. అది చూసిన ప్రతి ఒక్కరూ ఇదేం కక్కుర్తిరా బాబూ… అనుకుంటున్నారు. అదేమిటో మీరే చూడండి.. విషయమేమిటంటే.. పాకిస్థాన్ కు చెందిన ఓ జర్నలిస్ట్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఇప్పుడది నెట్టింట తెగ వైరలవుతోంది. అయితే ఆ వీడియోలో.. పాకిస్థాన్ లోని ఓ ఏటీఎంలో బ్యాంకు అధికారులు కస్టమర్లు కరోనా బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎవరైనా […]

Update: 2020-03-31 04:33 GMT

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక వీడియో తెగ వైరలవుతోంది. అది చూసిన ప్రతి ఒక్కరూ ఇదేం కక్కుర్తిరా బాబూ… అనుకుంటున్నారు. అదేమిటో మీరే చూడండి..

విషయమేమిటంటే.. పాకిస్థాన్ కు చెందిన ఓ జర్నలిస్ట్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఇప్పుడది నెట్టింట తెగ వైరలవుతోంది. అయితే ఆ వీడియోలో.. పాకిస్థాన్ లోని ఓ ఏటీఎంలో బ్యాంకు అధికారులు కస్టమర్లు కరోనా బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎవరైనా కస్టమర్ డబ్బులు డ్రా చేసే ముందు శానిటైజర్స్ వాడేందుకుగాను బ్యాంకు సిబ్బంది ఏటీఎంలో శానిటైజర్స్ ను ఉంచారు. అయితే.. ఓ యువకుడు ఆ ఏటీఎంలోకి వచ్చి మొదటగా అక్కడ శానిటైజర్ ఉపయోగించాడు. తర్వాత డబ్బులు డ్రా చేసుకున్నాడు. ఆ అనంతరం ఏటీఎం నుంచి వెళ్లేటప్పుడు తన వెంట అక్కడున్న శానిటైజర్ బాటిల్ ను కూడా తీసుకెళ్లాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇదేందీరా బాబూ.. మరీ ఇంతగనం కక్కుర్తా అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.


Tags: pakisthan, ATM, sanitizer, theft, video, social media

Tags:    

Similar News