విద్యుత్ ఘాతంతో యువకుడు మృతి

దిశ, నిజామాబాద్ : విద్యుత్ ఘాతానికి గురై బాణావత్ ప్రేమ్ అలియాస్ చింటూ (25) మృతి చెందిన ఘటన సోమవారం జక్రాన్ పల్లి మండలం పడకల్ తండాలో చోటు చేసుకుంది. ఎస్సై సాయిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బాణావత్ ప్రేమ్ అలియాస్ చింటూ కూరగాయలు పండిస్తున్నాడు. అయితే తన పొలం సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లో సమస్య తలెత్తడంతో మృతుడి కూరగాయల పంటకు నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రేమ్ ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు వెళ్లి […]

Update: 2021-04-26 03:24 GMT

దిశ, నిజామాబాద్ : విద్యుత్ ఘాతానికి గురై బాణావత్ ప్రేమ్ అలియాస్ చింటూ (25) మృతి చెందిన ఘటన సోమవారం జక్రాన్ పల్లి మండలం పడకల్ తండాలో చోటు చేసుకుంది. ఎస్సై సాయిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బాణావత్ ప్రేమ్ అలియాస్ చింటూ కూరగాయలు పండిస్తున్నాడు. అయితే తన పొలం సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లో సమస్య తలెత్తడంతో మృతుడి కూరగాయల పంటకు నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రేమ్ ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు వెళ్లి సమస్యను పరిష్కరించడానికి ట్రాన్స్‌ఫార్మర్ పైకి ఎక్కి ప్రమాదవశాత్తూ విద్యుత్ ఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Tags:    

Similar News