యువకుడు ఆత్మహత్య.. అందుకే అంటూ సెల్పీ వీడియో..

దిశ, బేగంపేట : అభిమానంగా ప్రేమించిన అమ్మాయి ప్రేమను అంగీకరించకపోవడంతో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీరు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిరుపతికి చెందిన నిరాజ్ కుటుంబం కొద్దిరోజులుగా ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మధుర నగర్ లో అపార్ట్ మెంట్‌లో నివసిస్తున్నారు. ఆయన కుమారుడు విశాల్ (26) సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో రూమ్ […]

Update: 2021-08-23 10:53 GMT

దిశ, బేగంపేట : అభిమానంగా ప్రేమించిన అమ్మాయి ప్రేమను అంగీకరించకపోవడంతో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీరు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిరుపతికి చెందిన నిరాజ్ కుటుంబం కొద్దిరోజులుగా ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మధుర నగర్ లో అపార్ట్ మెంట్‌లో నివసిస్తున్నారు. ఆయన కుమారుడు విశాల్ (26) సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.

ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో రూమ్ లో నిద్ర పోతాను అని తల్లిదండ్రులకు చెప్పి రూమ్ లోకి వెళ్లి పడుకున్నాడు. సోమవారం ఉదయం నిరాజ్ తన కుమారుడు విశాల్‌ను నిద్రనుండి లేపే ప్రయత్నం చేశారు. ఎంతకీ మాట్లడక పోవడంతో సమీపంలో ఆస్పత్రికి తీసుకెళ్లారు అప్పటికే విశాల్ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు తండ్రి నిరాజ్ ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విశాల్ నిద్రపోయిన రూమ్ లో వెతికి చూడగా ప్రక్కన సైనేడ్ బాటిల్ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. దీంతో పాటు సెల్‌ఫోన్ లభ్యం కాగా అందులో ఒక అమ్మాయిని ప్రేమించానని ఆమె నిరాకరించడంతో తాను ఆత్మహత్య చేసుకున్నట్లు సెల్ఫీ వీడియోలో లభ్యం అయినట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News