అక్రమ సంబంధం.. భర్తను హతమార్చేందుకు భార్య మాస్టర్ ప్లాన్

దిశ, పరిగి: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది భార్య. ఈ ఘటన విషాదకర ఘటన వికారాబాద్ జిల్లా చంగోముల్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ శ్రీశైలం వివరాల ప్రకారం.. చంగోముల్ గ్రామానికి చెందిన ఎరుకల వెంకటయ్య(30), మాధవి భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, మాధవి అదే గ్రామానికి చెందిన శేఖర్ అనే వ్యక్తితో కొంతకాలంగా అక్రమ సంబంధం ఏర్పరచుకుంది. వీరి అక్రమ సంబంధానికి భర్త వెంకటయ్య అడ్డొస్తున్నాడని […]

Update: 2021-11-05 10:15 GMT

దిశ, పరిగి: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది భార్య. ఈ ఘటన విషాదకర ఘటన వికారాబాద్ జిల్లా చంగోముల్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ శ్రీశైలం వివరాల ప్రకారం.. చంగోముల్ గ్రామానికి చెందిన ఎరుకల వెంకటయ్య(30), మాధవి భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, మాధవి అదే గ్రామానికి చెందిన శేఖర్ అనే వ్యక్తితో కొంతకాలంగా అక్రమ సంబంధం ఏర్పరచుకుంది. వీరి అక్రమ సంబంధానికి భర్త వెంకటయ్య అడ్డొస్తున్నాడని ప్రియుడు శేఖర్‌తో కలిసి హత్య చేయాలనుకుంది.

ఇందుకు పథకం ప్రకారం భర్త వెంకటయ్యను మాధవి గురువారం సాయంత్రం చంగోముల్ గ్రామంలోని జాహంగీర్ అనే రైతు పొలం వద్దకు తీసుకువెళ్లింది. అప్పటికే అక్క గుణపంతో రెడీగా ఉన్న శేఖర్ వెంకటయ్య తలపై బలంగా కొట్టాడు. ఇద్దరూ కలిసి వెంకటయ్యను హత్య చేశారు. అనంతరం తమకేమీ తెలియదన్నట్లుగా తిరిగి ఇద్దరూ ఇంటికెళ్లారు. తన భర్త రాత్రి నుంచి కనిపించడం లేదని గ్రామంలో చెప్పింది. గ్రామస్తులు ఊర్లో, పొలాల వద్ద వెతికారు. జాహంగీర్ పొలంలో హత్య చేయబడ్డాడని తెలిసింది. మృతుడు వెంకటయ్య అన్న నర్సింహులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ శ్రీశైలం తెలిపారు.

Tags:    

Similar News