కూర బాగలేదన్న భర్త.. కోపంలో భార్య ఏం చేసిందంటే ?
దిశ, వెబ్‌డెస్క్ : భార్య భర్తలకు మధ్య గొడవలు మాములే. ఇక వంటల విషయంలో చెప్పనక్కరలేదు. వంట విషయంలో భర్త ఎన్నో వంకలు పెడుతుంటారు.. కొన్ని సార్లు భర్తకు రుచిగా వండి పెట్టాలని ఎంతో టైం తీసుకుని వంట చేస్తూ ఉంటుంది భార్య. తీరా చూసే సరికి అది భర్తకు నచ్చదు. దాంతో భార్య అలగటం, లేదా ఇంకోసారి వంట చేయను అంటూ.. అనుకోవడం సహజం. కానీ, భర్త కూర బాగోలేదన్నాడని తల పగల గొట్టడం ఎక్కడైనా […]
దిశ, వెబ్‌డెస్క్ : భార్య భర్తలకు మధ్య గొడవలు మాములే. ఇక వంటల విషయంలో చెప్పనక్కరలేదు. వంట విషయంలో భర్త ఎన్నో వంకలు పెడుతుంటారు.. కొన్ని సార్లు భర్తకు రుచిగా వండి పెట్టాలని ఎంతో టైం తీసుకుని వంట చేస్తూ ఉంటుంది భార్య. తీరా చూసే సరికి అది భర్తకు నచ్చదు. దాంతో భార్య అలగటం, లేదా ఇంకోసారి వంట చేయను అంటూ.. అనుకోవడం సహజం. కానీ, భర్త కూర బాగోలేదన్నాడని తల పగల గొట్టడం ఎక్కడైనా చూశారా.. కానీ, ఈ సంఘటన హర్యానాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్లితే.. హర్యానాలోని హిసార్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని బార్వాలా పట్టణంలో బిందియా, దినేష్ దంపతులు నివసిస్తున్నారు. ప్రతిరోజూలాగానే భర్త ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాడు. భార్య అతని కోసం ఎంతో ప్రేమగా వంట చేసి భోజనం వడ్డించింది. కూరలో ఉప్పు తక్కువగా ఉందని భావించిన దినేష్(40) అదే విషయాన్ని చెప్పాడు. కూర రుచిగాలేదని కామెంట్ చేశాడు. దీంతో ఆగ్రహనికిలోనైన భార్య భర్త దినేష్‌తో గొడవకు దిగింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే భర్త మీద కోపంతో ఉన్న బిందియా పక్కనే ఉన్న ఇనుపరాడ్ తీసుకుని భర్త దినేష్ తలపై కొట్టింది. దినేష్ తల పగిలి తీవ్ర రక్త స్రావం అయ్యింది. దీంతో ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే తీవ్రంగా గాయపడిన దినేష్ ను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం ఈ ఘటనపై దినేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.