వైజాగ్ కరోనా ట్రీట్మెంట్ ఎలా ఉందంటే… బాధితుడి సర్టిఫికేట్
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నానాటికీ విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు 31 కేసులు నమోదయ్యాయి. అయితే గత మూడు వారాలుగా వైజాగ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగాయి. వైజాగ్‌లోని గాజువాకలో కరోనా బాధితుడు చికెన్ విక్రయాలు చేశాడని తేలిన దగ్గర్నుంచి మరింత ఆందోళన రేగింది. అయినప్పటికీ కొత్త కేసులు నమోదు కాకపోవడం పట్ల వైజాగ్ వాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది. వైరస్ బయటపడ్డ తొలినాళ్లలో వైజాగ్‌లో కరోనా బారినపడ్డ యువకుడు కోలుకున్నాడు. అనంతరం తన అనుభవాన్ని పంచుకున్నాడు. యూకే […]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నానాటికీ విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు 31 కేసులు నమోదయ్యాయి. అయితే గత మూడు వారాలుగా వైజాగ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగాయి. వైజాగ్‌లోని గాజువాకలో కరోనా బాధితుడు చికెన్ విక్రయాలు చేశాడని తేలిన దగ్గర్నుంచి మరింత ఆందోళన రేగింది. అయినప్పటికీ కొత్త కేసులు నమోదు కాకపోవడం పట్ల వైజాగ్ వాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
వైరస్ బయటపడ్డ తొలినాళ్లలో వైజాగ్‌లో కరోనా బారినపడ్డ యువకుడు కోలుకున్నాడు. అనంతరం తన అనుభవాన్ని పంచుకున్నాడు. యూకే నుంచి విశాఖ వచ్చిన పాతికేళ్ల యువకుడు కూడా కరోనా బారినపడి, మార్చి 21న విశాఖ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. అనంతరం చికిత్స తీసుకుని ఏప్రిల్ 8న డిశ్చార్జ్ అయ్యాడు. అతనేమన్నాడంటే..
“కరోనా పాజిటివ్ అని తేలిన తర్వాత విశాఖ జీహెచ్ సీసీడీలో చికిత్స పొందాను. అక్కడి నాకు చికిత్స అందించిన విధానం అద్భుతం. కరోనా వైరస్ తో పోరాడే క్రమంలో డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది ఎల్లవేళలా అండగా నిలిచారు. నిరంతరం స్ఫూర్తి కలిగిస్తూ మనోధైర్యం అందించారు. అంతేకాదు, ఎప్పుడూ ఫీల్డ్ లో ఉండి పనిచేసే ఏఎన్ఎంలు, ఎండీవో, మరికొందరు ఇతర అధికారులు కూడా నా విషయంలో మొదటి నుంచి ఎంతో శ్రద్ధ చూపించేవారు. నా ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేవారు. నిజంగా నాకు ఎంతో శ్రద్ధగా చికిత్స అందించడం పట్ల ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను” అంటూ పేర్కొన్నాడు.
Tags: visakhapatnam, coronavirus positive, review on hospital staff, ghccd, ap, vizag