పైల్స్ ట్రీట్మెంట్ తీస్కుంటే.. టీబీ సోకింది
దిశ ప్రతినిధి, హైదరాబాద్: కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక పోయిందన్న చందంగా పైల్స్ చికిత్స కోసం డాక్టర్ వద్దకు వెళ్లి ఓ బాధితుడు టీబీ వ్యాధిన పడ్డాడు. షాహినాయత్ గంజ్ ఇన్ స్పెక్టర్ చాంద్ బాషా కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని బేగంబజార్ లేబర్ అడ్డా ప్రాంతంలో డాక్టర్ సంజయ్ రాయ్ కొన్నేండ్లుగా వైద్య వృత్తి కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళ్ హాట్ అజీజ్ బాగ్‌కు చెందిన వెంకటరమణ(40) కొన్ని రోజుల క్రితం డాక్టర్ సంజయ్ […]
దిశ ప్రతినిధి, హైదరాబాద్: కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక పోయిందన్న చందంగా పైల్స్ చికిత్స కోసం డాక్టర్ వద్దకు వెళ్లి ఓ బాధితుడు టీబీ వ్యాధిన పడ్డాడు. షాహినాయత్ గంజ్ ఇన్ స్పెక్టర్ చాంద్ బాషా కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని బేగంబజార్ లేబర్ అడ్డా ప్రాంతంలో డాక్టర్ సంజయ్ రాయ్ కొన్నేండ్లుగా వైద్య వృత్తి కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళ్ హాట్ అజీజ్ బాగ్‌కు చెందిన వెంకటరమణ(40) కొన్ని రోజుల క్రితం డాక్టర్ సంజయ్ వద్ద పైల్స్ జబ్బుకు వైద్యం చేయాలని సంప్రదించారు. ఈ మేరకు సంజయ్ అతనికి వైద్యం అందించాడు. అనంతరం కొన్ని రోజుల తర్వాత ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటే టీబీ వ్యాధి పడ్డాడని తెలిసిందే. దీంతో డాక్టర్ సంజయ్ తెలిసీతెలియని వైద్య చేసి, తానను టీబీ బారిన పడేలా చేశాడని, అతనిపైచర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెడికల్ బోర్డు అనుమతితో కేసు దర్యాప్తు కొనసాగిస్తామని ఇన్ స్పెక్టర్ పేర్కొన్నారు.