సీఐడీ అదనపు డీజీపై ఓ నిర్ణయం తీసుకోండి.. ఏపీ సీఎస్‌కు కేంద్రం లేఖ
దిశ, ఏపీ బ్యూరో : నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఫిర్యాదుపై కేంద్రహోంశాఖ స్పందించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి సంజీవ్‌కుమార్ ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు లేఖ రాశారు. ఐపీఎస్ అధికారి, సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్ విషయంలో నిర్ణయం తీసుకోవాలంటూ లేఖలో కోరారు. అవసరమైతే సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎస్‌ను ఆదేశించారు. చర్యల వివరాలకు సంబంధించి త్వరగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇకపోతే తనను అక్రమంగా అరెస్ట్ […]
దిశ, ఏపీ బ్యూరో : నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఫిర్యాదుపై కేంద్రహోంశాఖ స్పందించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి సంజీవ్‌కుమార్ ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు లేఖ రాశారు. ఐపీఎస్ అధికారి, సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్ విషయంలో నిర్ణయం తీసుకోవాలంటూ లేఖలో కోరారు. అవసరమైతే సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎస్‌ను ఆదేశించారు. చర్యల వివరాలకు సంబంధించి త్వరగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇకపోతే తనను అక్రమంగా అరెస్ట్ చేసి, విచారణలో థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ ఎంపీ రఘురామకృష్ణంరాజు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అలాగే సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్‌పై కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరడంతో స్పందించిన కేంద్రహోంశాఖ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది.